తిరుపతిలో జరుగుతున్న అమరావతి చాంపియన్‌షిప్ పోటీల్లో మన్యం పురుషుల వాలీబాల్ జట్టు రెండోసారి విజేతగా నిలిచింది. గురువారం ఉత్కంఠభరితంగా సాగిన పురుషుల వాలీబాల్ ఫైనల్ పోరులో విజయనగరం జిల్లా జట్టును 2–1 సెట్ల తేడాతో(25–20, 24–26, 15–11) ఓడించిన పార్వతీపురం మన్యం జిల్లా జట్టు చాంపియన్‌గా నిలిచింది. రూ.లక్ష నగదు బహుమతిని దక్కించుకుంది. విజేతగా నిలిచిన క్రీడాకారులకు, కోచ్, ఇతర సిబ్బందికి మన్యం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అభినందనలు తెలియజేసింది. –సాక్షి, పార్వతీపురం మన్యం


