● సెలవు రోజు కావడంతో
తప్పిన ముప్పు
కూలిన పాఠశాల ప్రహరీ
మక్కువ: మండలంలోని కోన ఉన్నత పాఠశాల ప్రహరీ కూలిపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు ప్రహరీ నానిపోవడంతో, మరుగుదొడ్లు పక్కనున్న భాగం పొలం వైపు కూలిపోయింది. ఈ పాఠశాలలో ఒకటి నుంచి పదో తరగతి వరకు సుమారు 280 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇటీవల ప్రహరీ కూలి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన సాలూరులో చోటుచేసుకున్న సంఘటన తెలిసిందే. అయితే కోనలో ఆదివారం నాడు కూలిపోవడంతో ప్రమాదం తప్పిందని విద్యార్థులు తల్లిదండ్రులు చెబుతున్నారు. ప్రహరీ పడిపోయిన విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసినట్లు హెచ్‌ఎం బి. సాయిలక్ష్మి విలేకరులకు తెలిపారు.


