ఇదేం తీరు..! | - | Sakshi
Sakshi News home page

ఇదేం తీరు..!

Aug 24 2026 1:07 AM | Updated on Aug 24 2026 1:07 AM

●కర్రలే.. దన్నుగా... చర్చించే తీరిక లేకపోవడం విడ్డూరం 28న ఓటర్ల జాబితా సవరణపై సమావేశం ఆశ్రమ పాఠశాలలో 8వ తరగతి ఎత్తివేత

న్యూస్‌రీల్‌

అదుపుతప్పి లోయలో పడిన పోలీసు వాహనం చికిత్స పొందుతూ కానిస్టేబుల్‌ మృతి మరో ముగ్గురికి తీవ్ర గాయాలు భావోద్వేగానికి గురైన ఎస్పీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జెడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు బాధితులను పరామర్శించిన మంత్రి కొండపల్లి

సోమవారం శ్రీ 24 శ్రీ ఆగస్టు శ్రీ 2026
పాలకులూ..

విద్యాహక్కు చట్ట సవరణకు యూటీఎఫ్‌ డిమాండ్‌

26 నుంచి బైక్‌ యాత్రలు.. 31న చలో విజయవాడ

ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని నిర్వహించి గిరిజన సమస్యలపై చర్చించడానికి ప్రజాప్రతినిధులకు తీరిక లేకపోవడం విడ్డూరంగా ఉంది. పలు సమస్యలతో గిరిజనులు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించాలి. సమస్యలతో సతమతమౌతున్న గిరిజనులను ఆదుకోవాల్సిన అవసరం పాలకులపై ఉంది. – విశ్వాసరాయి కళావతి,

మాజీ ఎమ్మెల్యే, పాలకొండ

నేడు పీజీఆర్‌ఎస్‌

పార్వతీపురం: కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ డా. ఎన్‌.ప్రభాకరరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్‌ కార్యాలయంలో ప్రతీ రోజు ప్రజల నుండి వినతులను స్వీకరించేందుకు సెల్లార్‌లో ప్రత్యేక కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. అర్జీల నమోదు, అర్జీల స్థితి దానికి సంబంధించి సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100కు నేరుగా కాల్‌ చేయవచ్చునన్నారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేకంగా రెవెన్యూ క్లినిక్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

పీజీఆర్‌ఎస్‌ కేంద్రాలలో క్యూఆర్‌ కోడ్‌

పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల్లో ప్రజల ఫీడ్‌బ్యాక్‌ సేకరణ కోసం క్యూఆర్‌ కోడ్‌లను తప్పనిసరిగా ప్రదర్శించాలని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్‌ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల వద్ద స్పష్టంగా కనిపించేలా క్యూఆర్‌ కోడ్‌ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు మొబైల్‌ ద్వారా స్కాన్‌ చేసి సేవలపై అభిప్రాయాలు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విజయనగరం గంటస్తంభం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ – 2026లో భాగంగా జిల్లాలో చేపడుతున్న ఓటర్ల జాబితా పరిశీలన, సవరణ ప్రక్రియపై ఈ నెల 28న సమీక్ష సమావేశం నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎలక్టోరల్‌ రోల్‌ పరిశీలకులు రోణంకి గోపాలకృష్ణ రాజకీ య పార్టీల ప్రతినిధులతో సమావేశమవుతార ని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాలో మార్పులు, చేర్పులు, అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నట్టు తెలిపా రు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతిని ధులు సమావేశానికి హాజరై తమ సూచనలు, అభ్యంతరాలను పరిశీలకుల దృష్టికి తీసుకురావాలని కలెక్టర్‌ కోరారు.

రామభద్రపురం: గిరిజన విద్యార్థులపై కూట మి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో గిరిజన విద్యార్థులకు అష్టకష్టాలు తప్పడం లేదు. తాజాగా మండలంలోని జన్నివలస పంచాయతీ పరిధి నేరళ్లవలస గిరిజన ఆశ్రమ పాఠశాలలో గత ఏడాది వరకు ఒకటో తరగతి నుంచి 8వ తరగతి వర కు తరగతులు నిర్వహించేవారు. ఈ విద్యా సంవత్సరం ఏమైందో తెలియదుగాని 8వ తరగతి ఎత్తేశారు. అక్కడ 8వ తరగతికి వచ్చిన పిల్లల ను మన్యం జిల్లాలోని పలు గిరిజన పాఠశాలలకు పంపించేశారు. దీంతో ఈ ప్రాంత చిన్నారులకు కష్టాలు తప్పడం లేదు.

సీతంపేట: గిరిజనాభివృద్ధిలో ఐటీడీఏ వ్యవస్థ కీలకం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రతి ఏటా ఐటీడీఏకు కోట్లాది రూపాయిలు నిధులు మంజూరవుతాయి. క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, తీరుతెన్నులు, ప్రతీ పథకం ఫలాలు గిరిజనులకు అందుతున్నాయా? సమస్యలు ఏమైనా ఉన్నాయా.. అని ప్రతీ మూడు నెలలకొకమారు ఐటీడీఏలో పాలకవర్గ సమావేశాలు నిర్వహించాల్సి ఉంది. దీనికి కలెక్టర్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తూ మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరై వివిధ సమస్యలను ప్రస్తావించి, పరిష్కార దిశగా కృషి చేయాల్సి ఉంది. జిల్లాలో రెండు ఐటీడీఏలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏ రెండింటిలోనూ ఇంతవరకు ఎటువంటి గవర్నింగ్‌ బాడీ సమావేశాలు రెండేళ్లయినా నిర్వహించకపోవడం గమనార్హం. ప్రతీ మూడు నెలలకొకసారి తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉందనే నిబంధనలు ఉన్నాయి. సీతంపేట ఐటీడీఏ విషయానికి వస్తే ఇటు శ్రీకాకుళం పరిధిలో 16 మండలాలు, పార్వతీపురం మన్యం పరిధిలో 4 మండలాలు ఉన్నాయి. రెండు జిల్లాల్లోనూ ముగ్గురు మంత్రులున్నా ఈ పాలకవర్గ సమావేశాలు జరిపించకపోవడమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి చేసిన పనులపై సమీక్షించేందుకు ఐటీడీఏ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీ, ఎంపీపీలు జిల్లా ఉన్నతాధికారులు, కలెక్టర్‌, జేసీ, జెడ్పీ చైర్మన్‌, ఐటీడీఏ పీఓతో పాటు జిల్లా అధికారులందరితో గిరిజన సంక్షేమ శాఖా మంత్రి ఆధ్వర్యంలో ఇంత కీలకమైన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరగాలి. ఈ సమావేశాల నిర్వహణపై చంద్రన్న ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు.

వెంటాడుతున్న సమస్యలు

స్థానిక ఐటీడీఏ పరిధిలో 1240కు పైగా గిరిజన గ్రామాలున్నాయి. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారికి సింగిల్‌ లైన్‌ అడ్మినిస్ట్రేటర్‌గా విశేష అధికారాలు ఉన్నాయి. గిరిజనులకు సంబంధించిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఐటీడీఏ ద్వారానే జరుగుతాయి. రూ.కోట్ల నిధులు గిరిజన సంక్షేమం కోసం ఖర్చు చేస్తారు. విశేషమేమిటంటే పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు శాశ్వత పీవోను నియమించిన దాఖలాలు లేవు. సబ్‌ కలెక్టర్లతోనే ఐటీడీఏ పీఓలుగా ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నారు. పోనీ పాలకవర్గాలు నిర్వహించిన సరైన నిర్ణయాలు తీసుకుంటారా అంటే అదీలేదు. చాలా గ్రామాల్లో వివిధ రకాల సమస్యలు వెంటాడుతున్నాయి. రహదారులు, విద్య, వైద్యపరంగా అనేక సమస్యలున్నాయి. వీటిన్నింటిని పరిష్కరించాల్సి ఉంది. ఆశ్రమ పాఠశాలల్లో హెల్త్‌ వలంటీర్లు లేక విద్యార్థుల మరణాలు సంభవిస్తున్నాయి. గిరిజన సంక్షేమ ఇంజినీరింగ్‌ శాఖ ద్వారా చేపడుతున్న నిర్మాణాలు సైతం నాణ్యత లోపాలతో పాటు మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేక గిరిజనులు అల్లాడుతున్నారు. మలేరియా వంటి జ్వరాలు విజృంభిస్తున్నాయి. దోమతెరల పంపిణీ పూర్తి స్థాయిలో లేదు. మూడు లక్షల స్థానంలో కేవలం లక్ష లోపే పంపిణీ జరుగుతుంది. గిరిజన సహకార సంస్థ ద్వారా గిరిజనోత్పత్తులకు గిట్టుబాటు ధరలు లేవు. కొండచీపుర్లుతో పాటు ఇతర ఉత్పత్తులు దళారీలకే విక్రయించాల్సిన పరిస్థితి ఉంది. సాగునీటి కోసం చెరువులు, చెక్‌డ్యాంలు వంటి నిర్మాణాలు లేవు. వెలుగు కార్యక్రమాలు చీకటి మయంగా మారాయి. ఇక్కడ ఉన్న టీపీఎంయూ (ట్రైబుల్‌ ప్రాజెక్టు మానిటరింగ్‌ యూనిట్‌)ను గతేడాది ఎత్తేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలు గిరిజనులను వెంటాడుతున్నాయి.

సంతకవిటి మండలం ప్రధాన నీటి వనరుల్లో రంగారాయపురం వద్దనున్న నారాయణపురం ఆనకట్ట ఒకటి. ఇందులో నీరు నిలవాలన్నా.. కాలువల్లోకి సాగునీరు తరలలన్నా.. షట్టర్లదే ప్రధాన భూమిక. ఈ ఆనకట్టలో మొత్తం 118 షట్టర్లు ఉన్నాయి. ఇవి నిలబడితేనే ఆనకట్టలో నీరు నిలుస్తుంది. నదిలో నీటిమ ట్టం పెరిగితే షట్టర్లు కిందపడిపోతాయి. ప్రస్తుత ఖరీఫ్‌లో ఎలినినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఆనకట్టలోకి వచ్చిన నీటిపై ఒత్తిడి పెరిగి నేరుగా కుడి కాలువలోకి ప్రవహించేలా స్లూయిస్‌ల నుంచి సాగునీరు కాలువల్లోకి మళ్లించే ప్రదేశం ముందున్న ప్రధాన షట్టర్లు పడిపోకుండా లష్కర్లు షట్టర్ల కు కర్రలు దన్నుగా నిలిపారు. దీంతో ఆనకట్ట దిగువ భూములతో పాటు కుడి ప్రధాన కాలువలోకి సాగునీరు పుష్కలంగా ప్రవహిస్తుంది. – సంతకవిటి

టంగుటూరి చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న జేసీ వైశాలి తదితరులు

పార్వతీపురం: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు సేవలు చిరస్మరణీయమని జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.వైశాలి అన్నారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో టంగుటూరి జయంతి వేడుకలలో భాగంగా ఆదివారం టంగుటూరి చిత్రపటానికి ఆమె పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రకాశం పంతులు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని మద్రాసులో సైమన్‌ కమిషన్‌ వ్యతిరేక ప్రదర్శనలో తుపాకి గుళ్లకు ఎదురొడ్డి ఆంధ్రకేసరి అని పేరు పొందారని కొనియాడారు. పొట్టి శ్రీరాములు త్యాగ ఫలితంగా ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడినప్పుడు దానికి తొలి ముఖ్యమంత్రిగా టంగుటూరి ప్రకాశం పంతులు ఎన్నికయ్యారని, ఆయన పాలనా కాలంలో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను అమలు చేశారన్నారు. ఆయన సేవలకు గుర్తుగా 1972లో ఒంగోలు జిల్లాకు ‘ప్రకాశం జిల్లా’గా నామకరణం చేశారన్నారు. టంగుటూరి ప్రకాశం పంతులు జీవితం నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని, వారి చరిత్ర నేటి విద్యార్థులకు భోదించవలసిన అవసరం ఉందని తెలిపారు. జాతీయోద్యమంలో ఆయన పోషించిన పాత్ర, ప్రజా సేవలను స్మరించుకొన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ కె.హేమలత, సూపరింటెండెంట్‌లు శ్రీరామమూర్తి, వై.జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

పైడిమారమ్మకు శ్రావణ సారె

జరగని ఐటీడీఏ పాలకవర్గ సమావేశాలు

రెండేళ్లయినా పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం

సమావేశాలను మరిచిన మంత్రులు

మూడు నెలలకు ఓసారి నిర్వహించే నిబంధనలు ఏమయ్యాయి?

గిరిజనాభివృద్ధి హుళక్కే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement