గర్భాం – గరివిడి ప్రధాన రహదారి దుస్థితి
మెరకముడిదాం: ఆ రహదారిలో ప్రయాణించాలంటే సర్కస్ ఫీట్లు చేయడమైనా రావాలి.. లేదా బైక్ జంపింగ్‌లు చేయడమైనా రావాలి అన్నట్టుగా తయారైంది గర్భాం – గరివిడి ప్రధాన రహదారి. ఈ రహదారిలో ప్రయాణించాలంటేనే వాహనచోదకులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అడుగుకో గొయ్యి ఏర్పడడంతో ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈ రహదారి మరీ అధ్వానంగా తయారైనా ప్రజాప్రతినిధులు గాని అధికారులు గాని పట్టించుకోక పోవడం బాధాకరం. ఇదిలా ఉంటే రహదారి మరమ్మతులకు రూ. 40 లక్షలు మంజూరైనట్లు తెలిసింది. అయితే ఇంతవరకు ఎందుకు పనులు చేపట్టడం లేదో పాలకులకే తెలియాలి. ఇప్పటికై నా అధికారులు, పాలకులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
ప్రమాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా
గర్భాం – గరివిడి రోడ్డు


