● గ్రోత్ సెంటర్‌లో మరో ప్రమాదం
● బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్‌లో ఘటన
బొబ్బిలి: పట్టణ సమీపంలోని గ్రోత్‌సెంటర్‌లో గల కంపెనీల్లో వరుస ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఇటీవల ఓ కంపెనీలో గడ్డర్ మీద పడి వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. శుక్రవారం బెర్రీ ఫెర్రో ఎల్లాయీస్ కంపెనీలో ఆక్సిజన్‌ను సిలిండర్లలోకి నింపుతుండగా గ్యాస్ లీకై ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి.
అలజంగికి చెందిన యందవ సీతయ్యతో పాటు యూపీకి చెందిన సరాజ్‌పాల్‌లు సాయంత్రం కంపెనీలో ఆక్సిజన్‌ను సిలిండర్లలోకి ఎక్కిస్తున్నారు. ఈ సమయంలో ఒక్కసారిగా ఆక్సిజన్ లీకవగా సీతయ్యకు స్వల్పగాయాలు, సరాజ్‌పాల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సీతయ్యకు ప్రాథమిక చికిత్స చేశారు. సరాజ్‌పాల్‌ను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. స్థానిక అభయ ఆస్పత్రిలో వారిని చేర్పించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా కంపెనీల యాజమాన్యాలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.


