25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం | - | Sakshi
Sakshi News home page

25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం

Aug 22 2026 1:35 AM | Updated on Aug 22 2026 1:35 AM

25న తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం

విజయనగరం టౌన్‌: గిడుగు రామమూర్తి జయంతిని పురస్కరించుకుని ఈ నెల 25న తెలుగు భాషా పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తెలుగు సాహిత్య సాంస్కృతిక వైభవం పేరుతో రాష్ట్రస్ధాయి ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుగు భాషా పరిరక్షణ సమితి వ్యవస్ధాపకుడు, శ్రీశ్రీ కళావేదిక జిల్లా కన్వీనర్‌ సముద్రాల గురుప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్‌ హోటల్‌లో శుక్రవారం ఉత్సవ నిర్వహణ చైర్‌పర్సన్‌ గురాన రాధికతో కలిసి ఆహ్వానప్రతులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 25న ఉదయం 9 గంటలకు సన్‌స్కూల్‌లో జరిగే ఈ ఉత్సవానికి రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడితో పాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారన్నారు. కార్యక్రమంలో పి.కన్నయ్య, గొర్లె వెంకట సీతారామమూర్తి, లింగాల నరసింగరావు, డిమ్స్‌ రాజు, సుభద్రాదేవి, ఈపు విజయకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement