విజయనగరం టౌన్: ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇండియన్ పోలీస్ మెడల్‌ను తీసుకున్న స్పెషల్ బ్రాంచ్ రిటైర్డ్ హెడ్‌కానిస్టేబుల్ మండ రామచంద్ర శేఖరరావును ఎస్పీ ఏఆర్.దామోదర్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం అభినందించారు. జిల్లా పోలీస్‌శాఖలో 39 ఏళ్లపాటు వివిధ హోదాల్లో అత్యున్నత క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసిన రామచంద్ర సేవలను కేంద్రప్రభుత్వం గుర్తించి 2024లో ఇండియన్ పోలీసు మెడల్ ప్రకటించిందన్నారు. 2026 మార్చిలో ఆయన ఉద్యోగవిరమణ చేశారని, 80వస్వాతంత్య్ర దినోత్సవంలో పురస్కారాన్ని స్వీకరించారని చెప్పారు. పోలీస్‌శాఖకు చంద్రశేఖర్ నిబద్ధతతో చేసిన సేవలను ఎస్పీ ఈ సందర్భంగా ప్రశంసించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ ఏవీ లీలారావు, పోలీస్ అధికారులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.


