దారి మారదు..! | - | Sakshi
Sakshi News home page

దారి మారదు..!

Aug 21 2026 3:21 AM | Updated on Aug 21 2026 3:21 AM

తారు రాదు.. దారి మారదు..!

ఆర్‌అండ్‌బీ శాఖ రహదారులకు గ్రహణం

పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో

తారు కొరత

జేఈలు లేక మందగిస్తున్న పర్యవేక్షణ

తారు రాదు..

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి చేయాల్సిన రహదారులకు గ్రహణం పట్టింది. ప్రధానంగా పశ్చిమాసియా యుద్ధ ప్రభుత్వం వల్ల తారు దొరకడం కష్టమైంది. తారు కొరత కారణంగా ధర కూడా పెరగడంతో అప్పటి అంచనాల ప్రకారం కాంట్రాక్టర్లు వెనకడుగు వేస్తున్నారు. పలు పనులకు సంబంధించి టెండర్లు పిలిచినప్పు డు టన్ను తారు రూ.40 వేలకు లభించేది. ఇప్పుడు రూ.90 వేలు అయ్యింది. ఈ ప్రభావం వల్ల చాలా వరకూ రహదారులు పెండింగ్‌లో ఉండిపోయా యి. గోతులను తాత్కాలిక చర్యగా కప్పి సరిపెడుతున్నారు.

32 పనులు మంజూరు.. సగం కూడా కాలే..

జిల్లాలో రహదారులు, భవనాల శాఖ పరిధిలో మొ త్తం 1,030 కిలోమీటర్ల మేర రహదారులు ఉన్నా యి. ఇందులో రాష్ట్రీ య రహదారులు 465 కి.మీ. కాగా.. మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్లు 565 కి. మీ. వరకూ ఉన్నాయి. ప్రస్తుతం చాలా చోట్ల రోడ్లపై గుంతలు పడ్డా యి. రాయగడ వైపు వెళ్లే కూనేరు రహదారిలో భారీస్థాయిలో గోతులు పడ్డాయి. రూ.4 కోట్లతో పనులు మంజూరైనా కాంట్రా క్టర్‌ ముందుకు రావ డం లేదు. ఇటీవల వాహనదారుల ఆందోళన నేపథ్యంలో తాత్కాలికంగా గోతులు పూడ్చారు. జిల్లాలో 2025–26లో రూ.42.2 కోట్ల వ్యయంతో 32 పనులు మంజూరయ్యాయి. ఇందులో పార్వతీపు రం, కురుపాం, పాలకొండ పరిధిలోని 10 వర్కులు పూర్తి కాగా..మూడు పురోగతిలో ఉన్నాయి. పార్వతీ పురంలో 20.8 కి.మీ. మేర నాలుగు వర్కులు, కురుపాంలో 5 కి.మీ.తో ఒకటి, పాలకొండలో 11 కి.మీ. మేర మూడు స్టేట్‌ హైవే పనులు చేయాల్సి ఉంది. ఎండీఆర్‌(మేజర్‌ డిస్ట్రిక్ట్‌ రోడ్స్‌)కు సంబంధించి పార్వతీపురంలో మూడు కి.మీ. మేర రెండు పనులు, కురుపాంలో 32 కి.మీ.(ఆరు వర్కులు), పాలకొండలో 12 కి.మీ(రెండు వర్కులు), సాలూరులో 4.5 కి.మీ. మేర ఒక వర్కు చేపట్టాలి. వీటికి సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. పశ్చిమాసి యా యుద్ధ ప్రభావం, తారు కొరత, ధర పెరుగుద ల వల్ల రహదారులు పూర్తి చేయడానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు.

పర్యవేక్షించే జేఈలు ఏరీ?

మరోవైపు శాఖలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధి స్తోంది. మొత్తం 15 మంది జేఈలు అవసరం కాగా..కురుపాం, బలిజిపేటలో మాత్రమే ఉన్నారు. ఇంకొకరు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. మొత్తం పనులను ఇద్దరు జేఈలే పర్యవేక్షించాల్సి వస్తోంది. దీనివల్ల పనిభారం పెరగడమే కాక.. రహదారి పనుల పర్యవేక్షణ కూడా దెబ్బ తింటోంది. పనుల్లో నాణ్యతకు కూడా కాంట్రాక్టర్లు తిలోదకాలిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement