ఈ చిత్రం చూశారా... జేసీబీతో తవ్వుతున్నది వెంగళరాయసాగర్ కుడికాలువ ప్రధాన గట్టు. ఈ ప్రాంతంలో కంకరకు డిమాండ్ ఉండడం, ట్రాక్టర్ రూ.2వేలు పలుకుతుండడంతో అక్రమార్కులు కాలువగట్టును తవ్వేసి ట్రాక్టర్లతో తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. ఇది చూసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాకాలంలో గట్టుకు గండ్లుపడి పొలాలు ముంపునకు గురవుతాయని ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ అధికారులు స్పందించి గట్టును పరిరక్షించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై ఆర్‌ఐ రామ్‌కుమార్ మాట్లాడుతూ గ్రావెల్ తవ్వకాలకు ఎటువంటి అనుమతుల లేవని, వీఆర్వోను పంపించి అడ్డుకుంటామన్నారు. – బొబ్బిలి రూరల్


