వెన్నుపోటుపై మండిపాటు | - | Sakshi
Sakshi News home page

వెన్నుపోటుపై మండిపాటు

Jun 10 2026 12:25 AM | Updated on Jun 10 2026 12:25 AM

పాలకొండ: రాష్ట్రంలో చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సాలూరు, పాలకొండలో రౌండ్‌ టేబుల్‌ సమావేశాలు మంగళవారం నిర్వహించారు. సాలూరులోని పార్టీ కార్యాలయంలో, పాలకొండలోని ఏఎంజీ కన్వర్షన్‌ హాల్‌లో ఈ సమావేశాలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతిపై పాలకొండలో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ అందరినీ ఆలోచింపజేసింది. దీని ద్వారా ప్రజలకు చంద్రబాబు పాలనలో ఏం జరిగిందో ఇట్టే అర్ధమైంది. సాలూరులో మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్నదొర చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పాలకొండలో ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌, మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement