కోటదుర్మమ్మ ఆలయ ఈఓకు తోటపల్లి దేవస్థానం బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

కోటదుర్మమ్మ ఆలయ ఈఓకు తోటపల్లి దేవస్థానం బాధ్యతలు

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

కోటదుర్మమ్మ ఆలయ ఈఓకు తోటపల్లి దేవస్థానం బాధ్యతలు మన్యంపై మలేరియా పంజా ● సీతంపేట ఏరియా ఆస్పత్రిలో ఒకే రోజు 10 పాజిటివ్‌ కేసులు

గరుగుబిల్లి: పాలకొండలోని కోటదుర్గమ్మ ఆల యం ఈఓ వి.వి.సూర్యనారాయణ గరుగుబిల్లి మండలంలోని తోటపల్లి వేంకటేశ్వరస్వామి, కోదండరామస్వామి ఆలయాల కార్యనిర్వహణాధికారిగా సోమవారం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఈఓగా విధులు నిర్వహిస్తున్న బి.శ్రీనివాస్‌ జూన్‌ 21 వరకు మెడికల్‌ లీవ్‌ పెట్టారు. దీంతో సూర్యనారాయణకు అద నపు బాధ్యతలు అప్పగిస్తూ దేవదాయశాఖ కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

సీతంపేట: సీతంపేట ఏరియా ఆస్పత్రిలో ఒక్క రోజు 10 మలేరియా కేసులు నమోదు కావడం అటు ప్రజలు, ఇటు వైద్యవర్గాలను ఆందోళన కు గురిచేస్తోంది. తీవ్రమైన ఎండలు, అకాల వర్షాలకు ఆస్పత్రికి రోగుల తాకిడి పెరిగింది. సోమవారం మొత్తం 357 ఓపీలు నమోదయ్యా యి. జ్వరంతో బాధపడుతున్న వారిని పరీక్షించగా.. మలేరియా ఆర్‌డీటీ కిట్‌ పాజిటివ్‌ 7, స్లైడ్‌ పాజిటివ్‌– 3 కేసులు నిర్ధారణ అయినట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ బి.శ్రీనివాసరావు తెలిపారు. మలేరియా పీడితులకు వెంటనే చికిత్స ప్రారంభించామన్నారు. మిగిలిన వారికి వ్యాధి నిర్ధారణ బట్టి వైద్యసేవలు అందించి మందులు అందజేశామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement