● చంద్రబాబు పాలనపై నమ్మకం పోయింది | - | Sakshi
Sakshi News home page

● చంద్రబాబు పాలనపై నమ్మకం పోయింది

Jun 9 2026 8:34 AM | Updated on Jun 9 2026 8:34 AM

● చంద్రబాబు పాలనపై నమ్మకం పోయింది ● మోసం చేసిన కూటమి ప్రభుత్వం

చంద్రబాబు ఉచిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. సంక్షేమ పథకాలను ఎగ్గొట్టేశారు. రెండేళ్లలో ఆయన పాలనపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. వచ్చేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమే. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కలిసికట్టుగా పనిచేద్దాం. జగన్‌ 2.0లో పార్టీ కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యం లభిస్తుంది. పార్వతీపురంలో పార్టీ పటిష్టతకు జోగారావు కృషి ఎనలేనిది.

– శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, వైఎస్సార్‌సీపీ

పార్వతీపురం మన్యం జిల్లా ఽఅధ్యక్షుడు

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 704 రోజులు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసింది. ఎన్నికల సమయంలో ఆరు హామీల పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారంలోకి వచ్చింది. వాటిని అమలుచేయడంలో విఫలమై ప్రజావ్యతిరేకతను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీని రాజకీయంగా ఎలా అడ్డుకోవాలనే అంశంపైనే కూటమి నాయ కులు దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పోరాడినప్పుడే పార్టీ కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుంది. పార్టీ మరింత బలపడుతుంది.

– మామిడి శ్రీనివాసరావు, పార్వతీపురం

నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ పరిశీలకుడు

Advertisement
 
Advertisement
Advertisement