● మృతుల కుటుంబాలకు సంతాపం
చీపురుపల్లి: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద దుర్ఘటనపై జెడ్పీ చైర్మన్, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, భీమిలి నియోజకవర్గ ఇన్‌చార్జి మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. సోమవారం సాయంత్రం స్టీల్ ప్లాంట్‌లో స్టీల్ లిక్విడ్ పడి తొమ్మిది మంది కార్మికులు మృతి చెందడం, మరికొంత మంది గాయాల భారిన పడడం విషాదకరమన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు ముమ్మరం చేసి క్షతగ్రాతులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, మృతుల కుటుంబాలను మానవతా దృక్పథంతో ఆదుకోవాలని కోరారు.


