వ్యాధులబారిన నిర్వాహకులు
బయట పనులు లేక, ఉపాధి పనులు ఏడాది పొడవునా ఉండకపోవడంతో చాలా మంది మహిళలు వంట నిర్వాహకులుగా ఉండిపోతున్నారు. ఒక్కో నిర్వాహకురాలికి ఇచ్చే జీతాన్ని ఇద్దరు నుంచి ముగ్గురు పంచుకుంటున్నారు. కట్టెల పొయ్యిలతో వంటలు చేయడం కారణంగా చాలా మంది వంటనిర్వాహకులు కళ్ల సమస్య ఎదుర్కొంటున్నారు. వాటితో పాటు ఇప్పుడు కొత్తగా శ్వాసకోస సంబంధిత వ్యాధులు వస్తున్నాయని వాపోతున్నారు. చాలా పాఠశాలల్లో వంట షెడ్డులు ఇరుగ్గా ఉండడంతో ఆయా షెడ్డుల్లో ఈ పొగలోనే మగ్గిపోతున్నారు. కూటమివచ్చి రెండేళ్లు కావస్తున్నా మధ్యాహ్నభోజన పథకానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి ప్రణాళికలు లేవు. శ్రమదోపిడీ కనిపిస్తోంది.
– కె.సురేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు
ఈ ఏడాది చర్యలు తీసుకుంటాం
అన్ని పాఠశాలల్లో గా్యాస్ పొయ్యిలమీదనే వంటలు వండాల్సిఉంది. గతేడాది నిధుల లేమి కారణంగా పెద్దపెద్ద పాఠశాలల్లో ఇబ్బందులు వచ్చాయి. ఈ ఏడాది ఆ కష్టాలకుచెక్ పెట్టే ఆలోచనలో ఉన్నాం. విద్యార్థులు అందరికీ సరిపడేలా వంటలు వండేందుకు గ్యాస్ పొయ్యిల వినియోగంపై ఉన్నతాధికారులతో మాట్లాడాం. ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల వరకూ ఎటువంటి ఇబ్బందులులేవు. ఉన్నత పాఠశాలల్లో ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమిస్తాం. – యాగాటి దుర్గారావు, ఎంఈఓ, రాజాం
రాజాం: గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రస్తుతం నీరుగారే పరిస్థితి కనిపిస్తోంది. గత ప్రభుత్వం శుచి, రుచికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా వంట నిర్వాహకుల కష్టాలకు చెక్‌పెట్టే దిశగా పలుచర్యలు తీసుకుంది. వంట వండేవారికి నెలకు రూ.3 వేల వేతనంతో పాటు కట్టె పొయ్యిల సమస్యలకు చెక్‌పెట్టి, గ్యాస్ బండల వినియోగాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. ఈ మేరకు పలు పాఠశాలల అభివృద్ధి నిధులతో గ్యాస్ పొయ్యిలు కొనుగోలు చేసి అప్పగించింది. కొన్నిచోట్ల దాతలు, మరికొన్నిచోట్ల కమిటీలు వాటిని కొనుగోలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత గ్యాస్ సిలిండర్లకు నిధులు విడుదల తగ్గిస్తూ వచ్చింది. చివరకు చాలీచాలనీ ఆ డబ్బులతో గ్యాస్ సిలిండర్లు విడిపించలేక కట్టెలపొయ్యిలమీదే నిర్వాహకులు వంటలు వండేవారు. ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది.
నిర్వాహకులను ఆదుకున్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
నియోజకవర్గంలో
వంట నిర్వాహకులు వివరాలు
మండలం – వంట నిర్వాహకులు
రాజాం – 145
రేగిడి – 178
సంతకవిటి – 162
వంగర – 142
చాలీచాలని డబ్బులు
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో వంట నిర్వాహకులకు చాలీచాలని డబ్బులు అందుతున్నాయి. ప్రాథమిక పాఠశాలకు ఒకరు, ప్రాథమికోన్నత పాఠశాలకు ఇద్దరు, ఉన్నత పాఠశాలలో ముగ్గురు నుంచి నలుగురు వంట నిర్వాహకులు మాత్రమే ఉండాలి.ఉన్నత పాఠశాలల్లో వంటలు వండాలంటే 200 మంది విద్యార్థులు దాటితే కనీసం ఆరుగురు సిబ్బంది ఉండాలి. చాలా పాఠశాలల్లో 500 మంది విద్యార్థులు దాటి ఉన్నారు. ఆయా పాఠశాలల్లో ఎనిమిది మంది నుంచి పదిమంది నిర్వాహకులు ఉంటేగానీ వంటలు జరుగడంలేదు. ఈ ప్రభుత్వం ఇస్తున్న అరాకొర డబ్బులను ఆ పదిమంది సర్దుబాటుచేసుకుని వంటలు వండుతున్నారు. వాటికి తోడు 10 సంవత్సరాల్లోపు విద్యార్థికి రూ.5.88, 10 నుంచి 15 సంవత్సరాల మద్య విద్యార్థులకు రూ. 8.57 చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుండడంతో ఈ డబ్బులు ఆయా పాఠశాలల్లో కట్టెలు, ఇతర వంట సామగ్రి కొనుగోలు చేసుకునేందుకు కూడా చాలని పరిస్థితి ఉందని వంట నిర్వాహకులు వాపోతున్నారు. ప్రస్తుతం వంటసామగ్రి ధరలు పెరిగాయని, పప్పుతో పాటు ఉల్లి, అల్లం, వెల్లుల్లి ధరలు అధికంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్నట్లు వంటనిర్వాహకులు వాపోతున్నారు.
ప్రభుత్వ పాఠశాలలకు అందని గ్యాస్ సిలిండర్లు
కట్టెల పొయ్యిలమీదే గతేడాది ఎండీఎం వంటలు
శ్వాసకోశ సంబంధిత వ్యాధులబారిన నిర్వాహకులు
ఈ ఏడాది అదే పరిస్థితి


