● శ్మశాన వాటికకు పసుపు రంగు
విజయనగరం ఫోర్ట్: గురివింద గింజ తన నలుపు తాను ఎరగనట్లు టీడీపీ నేతలు తాము చేస్తే సంసారం, ఇతరులు చేస్తే వ్యభిచారం అన్న చందగా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రస్తుత సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలు అంతా సచివాలయాలకు, ప్రభుత్వ భవనాలకు వేసే రంగులపై నానాయాగీ చేశారు. వైఎస్సార్‌సీపీ రంగులు వేసుకుంటున్నారంటూ తెగ ప్రచారం చేసేవారు. అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ అభివృద్ధి పనులు చేపట్టేటప్పుడు ఏర్పాటు చేసే శిలాఫపలకాలు, శ్మశాన వాటికలకు కూడా ప్రస్తుతంఅధికార పార్టీ పసుపు రంగు వేస్తున్నారు.


