గంట్యాడ: మండలంలోని రామభద్రపురం గ్రామం మెయిన్ రోడ్డులో నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న 731 కిలోల పీడీఎస్ బియ్యాన్ని అధి కారులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. సీఎస్ డీటీ వీవీఎస్ మూర్తి, వీఆర్వోతో కలిసి వాహనాల ను తనిఖీ చేయగా ఓ ఆటోలో 15 ప్లాస్టిక్ సంచుల్లో బియ్యం తరలిస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనపై ఆటో డ్రైవర్‌తో పాటు బియ్యం కొనుగోలు చేసిన వ్యక్తిపై 6ఎ కేసు నమోదు చేయాలని కలెక్టర్, పౌర సరఫరాల శాఖకు నివేదిక పంపించారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని మధ్యవర్తుల సమక్షంలో స్థానిక రేషన్ దుకాణం డీలర్‌కు, ఆటోను గంట్యాడ పోలీసులకు అప్పగించారు.


