మలేరియాతో తస్మాత్‌...! | - | Sakshi
Sakshi News home page

మలేరియాతో తస్మాత్‌...!

Jun 8 2026 7:00 AM | Updated on Jun 8 2026 7:00 AM

ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం...

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌కు పంట భూములిచ్చేది లేదని రైతుల తీర్మానం మూడు గ్రామాల పరిధిలో 175 ఎకరాల సేకరణకు రెవెన్యూ అధికారుల సర్వే విషయం బయటకు పొక్కడంతో ప్రజా సంఘాలను ఆశ్రయించిన రైతులు నేడు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

నేడు కలెక్టరేట్‌ వద్ద ధర్నా

అప్రమత్తంగా ఉన్నాం..

దోమల నివారణ మందు పిచికారీ చేస్తున్నాం..

ప్రాణాలైనా ఇస్తాం.. భూములివ్వం...

సీతంపేట: ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభమైంది. జూన్‌ నుంచి అక్టోబరు వరకు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే జ్వరాలతో స్థానిక ఏరియా ఆస్పత్రి, పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా చలి, జ్వరంతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య రోజురోజుకు అధికమౌతుంది. జిల్లాలో వందల సంఖ్యలో జ్వర పీడితులు వైద్యం కోసం వస్తుంటే అందులో రోజుకు కనీసం 50 కేసులు వరకు మలేరియా పీవీ, పీఎఫ్‌ కేసులు నమోదౌతున్నట్టు అధికారిక సమాచారం. కానీ వీటికి రెండింతలు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో కేసులు నమోదౌతుండడం బట్టి చూస్తే ఈ ఏడాది మలేరియా తీవ్రత ఎంత ఉందో ఇట్టే అవగతమౌతుంది. పలు జాగ్రత్తలతోనే ఈ వ్యాధిని నిర్మూలించుకోవచ్చని వైద్య శాఖ చెబుతుంది.

మలేరియా ఎలా వస్తుంది?

ప్లాస్మోడియం పరాన్న జీవి ద్వారా ఆడ అనాఫిలిస్‌ దోమ కుట్టడంతో మలేరియా వస్తుంది. ఈ దోమలు మురుగునీటి నిల్వల్లో పెరుగుతాయి. ప్లోస్మోడియ జాతికి చెందిన నాలుగు రకాల పేరసైట్స్‌ వలన వస్తుంది. ప్లాస్మోడియం వైవాక్స్‌, ఫాల్సీఫారం, ఒవెల్‌ రకాల్లో మొదటి రెండు రకాల వలన మలేరియా జ్వరం వస్తుంది.

ఎలా మొదలౌతుంది..

ఆడ ఎనాఫిలిస్‌ దోమ కుట్టడం వలన ఏడు నుంచి పది రోజుల లోపల మలేరియా వస్తుంది. చలి, వణుకు, ఒళ్లు నొప్పులతో కూడిన విపరీతమైన జ్వరం రోజు మార్చి రోజు వస్తుంది. చెమటలు ఎక్కువగా పట్టడంతో జ్వరం తగ్గుతుంది. ఈ లక్షణాలు ఉన్న వారు వెంటనే మీ దగ్గర్లోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేయాలి. ఆర్‌డీటీ కిట్‌ ద్వారా రక్తపూత పరీక్షల ద్వారా మలేరియా వ్యాధిని నిర్దారించవచ్చు. ఆర్‌డీటీ కిట్‌ ప్రతీ ఆశా, మహిళా ఆరోగ్య కార్యకర్త వద్ద ఉంటుంది. వ్యాధిని బట్టి చికిత్స అందజేస్తారు.

చికిత్స

రక్తపూత పరీక్షల్లో నిర్ధారించిన ప్లాస్మోడియం రక్తాన్ని బట్టి వైద్యాధికారి చికిత్స అందజేస్తారు. ప్లాస్మోడియం వైవాక్స్‌ అయితే 14 రోజులు, ప్లాస్మోడియం ఫాల్సిఫారం అయితే మూడు రోజులు సంబంధిత మందులు ఇస్తారు. మందులు క్రమం తప్పకుండా వాడకపోయినా, సరైన సమయంలో వైద్య సిబ్బంది సలహా తీసుకోకపోయినా మలేరియా జ్వరం తీవ్ర స్థాయికి చేరి మెదడుకు వ్యాపించే ప్రమాదం ఉంది.

బొండపల్లి: తమకు జీవనాధారంగా ఉన్న భూములను ఎట్టి పరిస్థితుల్లోననూ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూ నిట్‌కు ఇచ్చేది లేదని మూడు గ్రామాల రైతులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఆ భూములను ప్రభు త్వం బలవంతంగా లాక్కోవాలని చూస్తే ప్రాణాలై నా.. ఇస్తామని, భూముల మాత్రం ఇవ్వమని తేల్చి చెప్పారు. మండలంలోని కిండాం అగ్రహరం గ్రా మంలో సీపీఎం, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో బాధిత మూడు గ్రామాలకు చెందిన రైతులు ఆదివా రం సమావేశమయ్యారు. రైతు సంఘం జిల్లా ప్రధా న కార్యదర్శి బుద్దరాజు రాంబాబు, సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ నేతృత్వంలో వీరు ఏకమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గడిచిన పది రోజులుగా రెవె న్యూ అధికారులు, తహసీల్దార్‌ మూడు గ్రామాల పరిధిలో తాము సాగు చేసుకుంటున్న భూములను సర్వే చేసి తమను భయభ్రాంతులకు గురి చేస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొండకిండాం గ్రామంలో గత ఏడాది ఎంఎస్‌ఎంఈ పార్కు పేరుతో సుమారు 58 ఎకరాల భూములను లాక్కొన్నారని, అందులో ఎస్సీ, ఎస్టీలు సాగు చేస్తున్న మామిడి, జీడితోటలు 12 ఎకరాల వరకు ఉన్నా.. వారికి న్యాయం చేసి నష్టం పరిహారం అందజేస్తామని చెప్పిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని నేతలు ధ్వజమెత్తారు. ఈ భూ ముల్లో ఒక్క పరిశ్రమ కూడా స్థాపించలేదన్నారు. తాజాగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పేరుతో కొండ కిండాం, కిండాం అగ్రహరం, రాచకిండాం గ్రామా ల పరిధిలో 175 ఎకరాలు రైతులు దశాబ్దాలుగా సాగు చేస్తున్న భూములను రెవెన్యూ అధికారులు లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని దీన్ని ఖండిస్తున్నామని తెలిపారు. మూడు గ్రామాల పరిధిలో 40 ఎకరాల డి పట్టా భూములతో పాటు 50 ఎకరా ల జిరాయితీ పల్లపు భూములను, 85 ఎకరాల వరకు జిరాయితీ మామిడి తోటలను బలవంతంగా లాక్కొనే ప్రయత్నం చేస్తున్నారని రైతు సంఘం, సీపీఎం నేతలు ధ్వజమెత్తారు. వీరికి తాము అండగా ఉంటామని భరోసానిచ్చారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూసేకరణను నిరసిస్తూ ఈ నెల 8న సోమవారం మూడు గ్రామాల బాధిత రైతులతో కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేయనున్నట్టు రైతు సంఘం, సీపీఎం నేతలు తెలిపారు. భూసేకరణను నిరసిస్తూ పోరాట కమిటీని కూడా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పోరాట కమిటీ కన్వీనర్‌గా చొక్కాకు సన్యాసినాయుడు, కో కన్వీనర్‌గా బొంగు అప్పారావు, భోపారపు శ్రీను, పెంట శివప్రసాద్‌, భోపారపు ఈశ్వరరావును ఎన్నుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గొర్లె శ్రీనివాసరావు, కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు తొత్తడి పైడిపునాయుడు, మూడు గ్రామాల బాధిత రైతులు పాల్గొన్నారు.

చేయాల్సినవి...

నీరు నిల్వ ఉంచిన తొట్లు, ఇతర పాత్రలు మూసివేయాలి.

ఇంటిలో ఉన్న నీటి కుళాయిల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.

శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి.

వారానికి ఒక సారి నీటి తొట్టెలను, ఇతర పాత్రలను శుభ్రంగా కడిగి, తుడిచి మరల నీరు నింపుకోవాలి.

దోమ తెరలను తప్పనిసరిగా వాడుకోవాలి.

ఉదయం, సాయంత్రం 5 గంటల నుంచి ఆరు గంటల సమయంలో తలుపులు మూసి ఉంచాలి.

మలేరియా సిబ్బందితో సహకరించి ఇంటి లోపల దోమల నివారణా మందును స్ప్రేయింగ్‌ చేయించుకోవాలి.

ఇంటిలోపల పనికిరాని చెత్తను ఉంచరాదు.

చేయకూడనవి..

మూతలు పెట్టకుండా నీరు నిల్వ ఉంచడం.

ఉదయం, సాయంత్రం సమయంలో తలుపులు తెరచి ఉంచడం.

దోమల మందును పిచికారీ చేసిన తరువతా గోడలు, తలుపు మూలలు శుబ్రం చేయడం.

వాటర్‌ ట్యాంకులు మూతలు తెరిచి ఉంచడం.

నీరు చేరే చోట పనికిరాని వస్తువులు, ఖాళీ డబ్బాలు ఉంచడం.

జాగ్రత్తలతోనే నిర్మూలన

ఎపిడమిక్‌ సీజన్‌ ప్రారంభం

రోజురోజుకు పెరుగుతున్న మలేరియా కేసులు

జ్వరపీడితులతో నిండుతున్న ఆస్పత్రులు

పరిసరాల పరిశుభ్రత పాటించకుంటే ప్రమాదమే..

ఆస్పత్రిలో వైద్య సిబ్బంది అంతా అప్రమత్తంగా ఉన్నాం. జ్వరపీడితులు వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేస్తున్నాం. మలేరియా పీవీ, పీఎఫ్‌లు వస్తే వెంటనే రోగికి ట్రీట్‌మెంట్‌ ఇస్తున్నాం. మందులు అందజేస్తున్నాం. అన్ని వ్యాధులకు మందులు అందుబాటులో ఉన్నాయి.

– బి.శ్రీనివాసరావు, సూపరింటెండెంట్‌, ఏరియా ఆస్పత్రి, సీతంపేట

హైరిస్క్‌ మలేరియా గ్రామాల్లో దోమల నివారణా మందు స్ప్రేయింగ్‌ చేస్తున్నాం. జ్వరాల వ్యాప్తిని అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాం. లార్వా వేట కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని గ్రామాలకు దోమ తెరలను కూడా పంపిణీ చేశాం.

– జె.మోహన్‌రావు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్‌, మలేరియా నివారణ శాఖ

Advertisement
 
Advertisement
Advertisement