అధికారంలోకి వస్తే సంపద సృష్టించేస్తామన్నారు. సూపర్ సిక్స్ అంటూ ఊదరగొట్టారు. మహిళలకు, ఆడబిడ్డలకు రాయితీలు, నిధులు కేటాయిస్తామన్నారు. ఉచితంగా మూడు సిలిండర్లు అంటూ గ్యాస్ కొట్టారు. అంతా బూటకమని ప్రజలు గుర్తించారు. వంట గ్యాస్ ధరలు రూ.వెయ్యికి చేరింది. మూడు నెలల క్రితమే రూ.60 పెంచారు. దీంతో రూ.2 కోట్లు భారం జిల్లా వాసులపై మోపారు. తాజాగా రూ.29 పెంచారు. మళ్లీ రూ.కోటి మేర భారం పెట్టారు. వాణజ్య సిలిండర్ల ధరలు పెరగటంతో చిరు వ్యాపారులు కుదేలయ్యారు. పెరుగుతున్న ధరలతో సాధారణ, పేద, మధ్య తరగతి, గిరిజనులపై భారం పడుతుంటే ప్రభుత్వ పెద్దలు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రజలు నారా వారి పాలనతో ఇదేం బాదుడు బాబు అంటూ మండిపడుతున్నారు. విశ్వాసరాయి కళావతి,
మాజీ ఎమ్మెల్యే, పాలకొండ
●


