అధికారంలోకి వస్తే ధరలు అదుపు చేస్తామన్న ప్రభుత్వం మహిళలపై కక్ష కట్టినట్లుంది. గ్యాస్ ధరలు నెలల వ్యవధిలో పెంచుతూ మరింత వాతలు పెడుతుంది. తాజాగా పెరిగిన ధరతో వంట గ్యాస్ బండ ధర నాలుగు నెలల వ్యధిలో దాదాపు వెయ్యికి చేరింది. ఈ భారం ప్రభుత్వమే భరించాలి. పేద, మధ్య తరగతి కుటుంబాలు బతకటమే భారంగా మారుతున్న తరుణంలో గ్యాస్, నిత్యవసర సరుకుల ధరలు పెంచటం ఆందోళనకు గురి చేస్తుంది. ఏడాదికి మూడు బండలు ఉచితమన్నారు. ఎవరికి వర్తిస్తుందో తెలియటం లేదు. చివరికి కట్టెలు ముట్టుకున్నా ధరలు భగ్గుమంటున్నాయి.
కె.చిన్నమ్మడు,
పాలకొండ మండలం
●


