న్యూస్‌రీల్
జనావాసాల్లోకి వన్య ప్రాణులు
గిరిజనులకు అవగాహన కల్పిస్తున్నాం..
–10లో
పరిశ్రమలు ఏర్పాటు చేయని వారికి నోటీసులివ్వండి
స్థానిక గ్రోత్‌సెంటర్‌లోని భూములను ఏపీఐఐసీ ఎం.డి దినేష్ కుమార్ శనివారం
సందర్శించారు.
స్కూల్ బస్సులపై కొరడా..!
మరికొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్న వేళ జిల్లాలో వేలాది మంది విద్యార్థులు రోజూ స్కూల్ బస్సులపైనే
ఆధారపడనున్నారు.
ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్ శ్రీ 2026
పచ్చని చెట్టుపై గొడ్డలి వేటు పడుతోంది. మైనింగ్, క్వారీలంటూ అక్రమార్కులు పచ్చని చెట్లను మాయం చేసి రహదారులు వేస్తూ మార్గం సుగమం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. ఈ వేసవిలో పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల వరకూ నమోదవుతున్నాయి. ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. వేడి గాలులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఇందుకు కారణం భూతాపాన్ని తగ్గించే చెట్లు, అడవుల వాతావరణం తగ్గిపోవడమేనని పర్యావరణ వేత్తలు అంటున్నారు.
–సాక్షి, పార్వతీపురం మన్యం
మన్యం అంటేనే పచ్చని కొండలు.. ఎటుచూసినా దట్టమైన చెట్లు.. ఆహ్లాదాన్ని పంచే చల్లని ఏజెన్సీ వాతావరణం. ఇది ఒకప్పటి మాటే.. ప్రస్తుతం ఆ వాతావరణమే మన్యంలో ఎక్కడా కానరావడం లేదు. పార్వతీపురం మన్యం జిల్లా భౌగోళిక విస్తీర్ణం 3,659 చదరపు కిలోమీటర్లు కాగా.. 1,077 చదరపు కిలోమీటర్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. మొత్తంగా 29.4 శాతం అడవులే ఉన్నాయి. మన్యంలో ఎటు చూసినా దట్టమైన చెట్లు, ఎత్తయిన కొండలు, నాగావళి, వంశధార, సువర్ణముఖి, వేగావతి నదుల పరవళ్లతో ఆహ్లాదకర వాతావరణం ఉండేది. కొన్నాళ్లుగా అభివృద్ధి పనుల పేరిట అడవుల రూపురేఖలు కోల్పోతున్నాయి. రోడ్లు, టవర్లు, ఆర్వోఎఫ్‌ఆర్ అంటూ పలు అభివృద్ధి పనులకు మార్గం సుగమం కావడం ఒకటైతే.. ఇదే సందర్భంలో మైనింగ్, క్వారీ తవ్వకాలు అంటూ కొండలను పిండి చేసేస్తున్నారు. వాటిని తరలించేందుకు చెట్లను తొలగించి రహదారులు చేస్తున్నారు. వంట చెరకు పేరిట కలప అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. మునుపటితో పోల్చుకుంటే అడవుల విస్తీర్ణం పెంపునకు కసరత్తు జరగడం లేదు. విలువైన చెట్లు తరలించుకుపోతున్నా అటవీ శాఖ పర్యవేక్షణ లేమి స్పష్టంగా కనిపిస్తోంది. టేకు, ఇతర విలువైన దుంగల తరలింపులో పెద్ద హస్తాలే ఎక్కువ ఉండడంతో ఏమీ చేయలేకపోతున్నారు.
వనాలకు నిప్పు..
పోడు వ్యవసాయం పేరుతో గిరిజనులు ఏటా నిప్పు పెట్టి ఆకులను కాల్చి వేస్తున్నారు. వేసవి సీజన్‌లో జీడి చెట్ల వద్ద ఈ పరిస్థితి మరింతగా ఉంటోంది. నిప్పు పెట్టిన సమయంలో నిర్లక్ష్యంగా రాత్రి అంతా వదిలేయడం వల్ల కార్చిచ్చు వ్యాపిస్తోంది. దీనివల్ల ఎత్తయిన చెట్లు కూడా అగ్నికి ఆహుతవుతున్నాయి. గత డిసెంబర్ నుంచి ఇప్పటి వరకూ జిల్లాలోని నాలుగు అటవీ రేంజ్‌ల పరిధిలో 342 చోట్ల వనాల వద్ద మంటలు వ్యాపించిన ఘటనలు సంభవించాయి. ఇందులో అత్యధికంగా సాలూరు రేంజ్ పరిధిలో 116, పాలకొండ 111, పార్వతీపురం 81, కురుపాం 34 చొప్పున ఉన్నాయి. 24 గంటలూ మంటలు ఆరని పాయింట్లు కూడా కొన్ని ఉన్నాయని అటవీ శాఖాధికారులు చెబుతున్నారు.
జిల్లాలో అటవీ రేంజ్‌లు: 4
(పాలకొండ, పార్వతీపురం,
సాలూరు, కురుపాం)
బ్లాక్స్ : 102
అటవీ విస్తీర్ణం :
1,07,721.38 హెక్టార్లు
చెట్లు కొట్టివేయడం, అడవుల్లో కూడా కట్టడాలు పెరిగిపోవడం వల్ల వన్య ప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో రెండు ఏనుగుల గుంపులు గ్రామాల్లోకి చొరబడి ఇటు ప్రజలకు, అటు అటవీ శాఖాధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పంటలను ధ్వంసం చేస్తున్నాయి. 13 మంది వరకూ మనుషులను పొట్టన పెట్టుకున్నాయి. సుమారు రూ.2.79 కోట్ల మేర పంటలను నష్టపరిచాయి.
గ్రామాల్లోకి సమీప కొండల నుంచి ఎలుగు బంట్లు, నక్కలు, అడవి దున్నలు, జింకలు వంటివి వస్తున్నాయి. ప్రమాదకర విష సర్పాలు కూడా ఇళ్లలోకి ప్రవేశిస్తున్నాయి. కురుపాం మండలం ఊసకొండ గ్రామంలో ఇళ్లలోకి ప్రవేశించిన కింగ్ కోబ్రా బాబూరావు అనే గిరిజనుడిని కాటు వేసింది. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయాడు. కొద్దిరోజుల క్రితం సీతంపేట ఐటీడీఏ పీవో కార్యాలయంలోకి నల్ల త్రాచు ప్రవేశించి భయాందోళన కలిగించింది. అటవీ శాఖ సిబ్బంది అప్రమత్తమై పట్టుకున్నారు. గతంలో రక్త పింజరి కూడా మరో చోట ఆందోళన కలిగించింది. ఇటీవల సాలూరు మండలం బాగువలస సమీపంలో అరుదైన పంట్ల పాము తారసపడింది. అడవుల్లోనే కనిపించే కింగ్ కోబ్రాలు తరుచూ గ్రామాల్లోకి రావడం వెనుక కారణం కూడా.. వాటికంటూ ఒక ఆవాస ప్రాంతాల్ని లేకుండా చేయడమే. అటవీ ప్రాంతాలను నాశనం చేస్తుండడం వల్ల అటు ఉష్ణ తాపం విపరీతంగా పెరగడంతో పాటు.. ఇటు వన్య ప్రాణులు కూడా వనాలను వదిలి జనావాసాల్లోకి వస్తున్నాయి.
కరిగిపోతున్న అడవి.. కాలిపోతున్న అవని
పచ్చదనం తగ్గితే.. భవిష్యత్తు ప్రశ్నార్థకమే
జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
పచ్చని చెట్ల మధ్య కార్చిచ్చు
జనావాసాల్లోకి వన్యప్రాణులు
అటవీ ప్రాంతాలను కాపాడేందుకు అన్ని చర్యలనూ తీసుకుంటున్నాం. కంపా, నరేగా నిధులతో మొక్కలు విరివిగా నాటి సంరక్షిస్తున్నాం. కార్చిచ్చు వల్ల కలిగే నష్టంపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. కొండలపై ఉన్న గిరిజన గ్రామాలకు కూడా అటవీ సిబ్బంది వెళ్లి వివరిస్తున్నారు. ఎవరైనా మంటలు పెట్టినా ఆర్పేశాక వెళ్లండి.
– జీఏపీ ప్రసూన, జిల్లా అటవీ శాఖాధికారి


