నవచేతన యాప్‌పై అవగాహన | - | Sakshi
Sakshi News home page

నవచేతన యాప్‌పై అవగాహన

Jun 7 2026 12:21 AM | Updated on Jun 7 2026 12:21 AM

విజయనగరం రూరల్‌: మండలంలోని జొన్నవలస గ్రామంలో ఐసీడీఎస్‌ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ కార్యకర్తలకు నవచేతన యాప్‌ వినియోగంపై శనివారం అవగాహన కల్పించారు. ఐసీడీఎస్‌ పీడీ బాలామణి ఈ కార్యక్రమంలో పాల్గొని, పలు సూచనలు చేశారు. ఆరేళ్ల వయసు లోపు చిన్నారులకు స్క్రీనింగ్‌ నిర్వహించి, వారి శారీరక, మానసిక స్థితి వివరాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని తెలిపారు. ఏ పిల్లల్లో అయినా చిన్నచిన్న లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే డీఈసీఐ రిఫరల్‌కు పంపించాలన్నారు. మూడేళ్ల వయసు లోపు పిల్లలతో వారి కుటుంబ సభ్యుల్లా వ్యవహరిస్తూ ఆటపాటలతో వారిని అలరిస్తే వారిలో నిమిషానికి 10 లక్షల న్యూరాలస్‌ వృద్ధి చెందుతాయన్నారు. రాకోడు పీహెచ్‌సీ వైద్యాధికారిణి కార్తీక..ఆరేళ్ల వయసులోపు పిల్లల ఏడీహెడ్‌ మైల్డ్‌ స్టోన్స్‌, ఆర్‌బీఎస్‌కేలపై అవగాహన కల్పించారు. పౌష్టికాహారం లోపంతో పిల్లలు బాధపడకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీవో రేఖావాణి, ఏసీడీపీవో సత్యవతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement