దోచేద్దాం..! | - | Sakshi
Sakshi News home page

దోచేద్దాం..!

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026 దోచేద్దాం..! అడ్డూ అదుపు లేకుండా తరలింపు దొరికినంత ఇసుక.. ఇష్టారాజ్యంగా వసూళ్లు.. పట్టుకున్నా.. ఫోన్లు వస్తాయి!

నదులను కొల్లగొడుతున్న ఇసుక మాఫియా జిల్లాలో జోరుగా ఇసుక అక్రమ తవ్వకాలు రాత్రింబవళ్లు యథేచ్ఛగా దోపిడీ..

కొమరాడ మండలం నుంచి రావాలంటే.. ట్రాక్టర్‌ ఇసుక రూ.3,600

అధికారికమైనా.. అ‘ధన’పు భారమే..

శనివారం శ్రీ 6 శ్రీ జూన్‌ శ్రీ 2026
జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నదులు, వాగులు, గెడ్డల్లో ఇసుక అక్రమ తవ్వకాలు, తరలింపుతో సొమ్ము చేసుకుంటోంది. ‘అధికార’ అండతో రాత్రీపగలు తేడాలేకుండా యంత్రాలతో ఇసుకను తవ్వతూ నదులను గుల్లచేస్తోంది. పెద్దపెద్ద గోతులు పెడుతూ నదీతీర గ్రామాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. అధికారిక రేవుల వద్ద అనధికార వసూళ్లకు పాల్పడుతూ వినియోగదారుల జేబులకు చిల్లుపెడుతోంది.

●కొమరాడ మండలం నాగావళి నదీ తీరం నుంచి ఇసుక పెద్ద ఎత్తున అక్రమంగా తరలిపోతోంది. రాత్రీపగలు తేడా లేకుండా ఒక్క పాయింటు నుంచి రోజుకు 20–30 లారీల వరకూ జిల్లాతో పాటు సరిహద్దులు దాటి, ఒడిశా వంటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు. కొమరాడ మండలం కోరిశీల గ్రామం సర్వే నంబర్‌ 54– 2ఏ పరిధిలోని నాగావళి నది తీరం నుంచి ఇసుకకు గత నెల 20న నిబంధనల ప్రకా రం మైనింగ్‌ కంపెనీకి అనుమతులు ఇచ్చా రు. దీనిపై కొంతమంది గిరిజనులు అభ్యంతరం వ్యక్తం చేయడం, వివాదం రేగడంతో తాత్కాలికంగా అక్కడ నిలుపుదల చేశారు. ఉలిపిరి పంచాయతీ రామ భద్రపురం, దేవకోన పంచాయతీ గాంధీనగ రం గ్రామాల మధ్య నాగావళి నది పక్కన ఉన్న రీచ్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు వస్తున్నాయి.

●పాలకొండ నియోజక వర్గం భామిని మండలం నేరడి–బి సమీపంలో వంశధార నదీ తీరం నుంచి ఇసుక అడ్డూ అదుపు లేకుండా తరలిపోతోంది. అధికారుల ప్రోత్సాహంతోనే తరలిస్తున్నారని స్థానికు లు చెబుతున్నారు. నేరడి–బి ర్యాంపు నిర్వహణకు భూగర్భగనుల శాఖ అనుమతుల మేరకు ఇసుక కుప్పలు వేస్తున్నట్లు రెవెన్యూ అధికారులు చెప్పుకొస్తున్నారు.

●వీరఘట్టం మండలం నడిమికెల్ల, పాలకొండ మండలం నాగావళి తీరం వెంబడి అన్నవరం తదితర ప్రాంతాల్లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. నాగావళి నది నుంచి నిత్యం వందల సంఖ్యలో లోడ్లు అక్రమంగా రవాణా అవుతున్నాయి.

●సాలూరు, బలిజిపేట, సీతానగరం మండలా ల్లో సువర్ణముఖి, వేగావతి నదులను అక్రమా ర్కులు తోడేస్తున్నారు. ట్రాక్టర్ల ద్వారా తరలించి ప్రైవేటు స్థలాలు, తోట ల్లో కుప్పలుగా నిల్వ చేస్తున్నారు. అక్కడ నుంచి లారీల ద్వారా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతోంది. వంతరాం, పనుకువలస, లక్ష్మీపురం ప్రాంతాల్లో అధికంగా ఈ పరిస్థితి ఉంది.

భామిని మండలంలో వంశధార నదీ తీరంలో అక్రమంగా

నిల్వ చేసిన ఇసుక

సాక్షి, పార్వతీపురం మన్యం:

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. అధికారులు దాడులు చేసినప్పుడు కొద్ది రోజులు మౌనంగా ఉంటున్నా.. తర్వాత యథావిధిగా ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ప్రభుత్వ నిబంధనలను, పర్యావరణ చట్టాలను బేఖాతరు చేస్తూ నదులు, వాగులు, వంకల నుంచి పెద్దఎత్తున ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని వంశధార, నాగావళి నదుల పరివాహక ప్రాంతాల తో పాటు పలుచోట్ల ఉన్న వాగులు, చెరువుల పరిసరాలు అక్రమ తవ్వకాల కేంద్రాలుగా మారుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అర్ధరాత్రి వేళల్లో జేసీబీలు, ట్రాక్టర్లు, లారీలతో ఇసుకను వెలికితీసి సమీప ప్రాంతాలకు తరలిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజల నిరసనలు, ఫిర్యాదులు వచ్చినప్పటికీ అక్రమ తవ్వకాలు మాత్రం ఆగడం లేదని విమర్శిస్తున్నారు. అధికారుల తనిఖీలు జరుగుతున్నప్పటికీ, వాటి ప్రభా వం కేవలం తాత్కాలికంగానే ఉంటోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

జిల్లాలో ఇసుక అక్రమ తరలింపు ‘అధికారికంగానే’ సాగుతోంది. ప్రధానంగా కొమరాడ మండలం కూనేరు–రామభద్రపురం తదితర పాయి ంట్ల నుంచి సామాన్య గృహ నిర్మాణదారులు పార్వతీపురం వంటి ప్రాంతాలకు ఇసుక తరలించాలంటే ట్రాక్టరుకు రూ.3,600 వరకూ వెచ్చించాల్సి వస్తోంది. ఇక్కడ రీచ్‌ దగ్గర ట్రాక్టరుకు రూ.850 అధికారికంగా వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు ఉచితం అని చెప్పినప్పుడు రూ.2 వేలు ఇస్తే ట్రాక్టర్‌ ఇసుకను తరలించేసేవా రు. మొన్నటి వరకు ఎవరైనా ఇంటి నిర్మాణం కోసం తరలిస్తే.. ఆధార్‌ కార్డు, చిరునామా, ఇతర వివరాలు చూపిస్తే సరిపోయేది. ఇప్పుడు అవేవీ అడగడం లేదు. పైగా, ఇక్కడ అధికారికం చేయడం వల్ల అక్కడ చెల్లించే రూ.850తో కలిపి రూ.3,200 నుంచి రూ.3,600 వరకూ వినియోగదారుల నుంచి తరలింపుదారులు వసూలు చేస్తున్నారు. అధికారికంగా వసూలు చేసే మొత్తానికి రీచ్‌ వద్ద ఎటువంటి రసీదు ఇవ్వడం లేదు. ఇక్కడ కూలీలను కూడా నిర్వహించడం లేదు. దానివల్ల ఆ మొత్తం భారం కూడా వినియోగదారునిపైనే పడుతోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు ఇసుకను తరలించకపోయినప్పుడే తక్కువ ధరకు వచ్చేదని గృహ నిర్మాణదారులు అంటున్నారు.

రానున్నది వర్షాకాలం కావడంతో ఇసుక లభ్యత, తరలింపునకు ఆస్కారం ఉండదన్న ఉద్దేశంతో అక్రమార్కులు దొరికినంత దోచేస్తున్నారు. స్థానికంగా ఉన్న కొందరు ట్రాక్టర్ల యజమానులు ఈ తరలింపులో కీలక పాత్ర పోషిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇష్టారాజ్యంగా లోడ్లు తరలిపోతున్నా అడపాదడపా దాడులతో అధికారులు సరిపెడుతున్నారు. ఇటీవల కాలంలో సీతానగరం, కొమరాడ, నడిమికెల్ల సమీపంలో గుట్టలుగా ఉన్న ఇసుకను, తరలిస్తున్న వాహనాలను అధికారులు సీజ్‌ చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులకు సంబంధించిన సొంత అవసరాల నిమిత్తం కూడా ట్రాక్టర్ల ద్వారానే తరలిస్తుండడం గమనార్హం. అధికారులు పట్టుకున్న వెంటనే ప్రజాప్రతినిధుల నుంచి ఫోన్లు వెళ్తున్నాయి. ట్రాక్టర్లను విడిచిపెట్టాలని హెచ్చరిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు జరిమానా విధించి వదిలేస్తున్నారు. మరుసటి రోజు నుంచే ఇసుకాసురులు యథావిధిగా ఇసుక దందా మొదలు పెట్టేస్తున్నారు. ఇసుక అక్రమ వ్యాపారం వెనుక ప్రజాప్రతినిధుల అండదండలు పుష్కలంగా ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement