నాన్నా.. లే నాన్నా.. | - | Sakshi
Sakshi News home page

నాన్నా.. లే నాన్నా..

Jun 6 2026 12:47 AM | Updated on Jun 6 2026 12:47 AM

నాన్నా.. లే నాన్నా.. ● తండ్రి మృతదేహాన్ని పట్టుకుని కన్నీరు పెట్టిన కుమార్తె

గరుగుబిల్లి/బలిజిపేట: నాన్నా.. లే నాన్నా... ఇప్పుడే బస్సు ఎక్కించావు... ఎన్నో జాగ్రత్తలు చెప్పావు.. అప్పుడే మా నుంచి దూరమయ్యావా... దేవుడా.. ఏమిటీ ఘోరం.. అంటూ తండ్రి మృతదేహాన్ని పట్టుకుని కుమార్తె రోదించిన తీరు అక్కడివారిని కన్నీరుపెట్టించింది. బలిజి పేట మండలం వెంగాపురం గ్రామానికి చెంది న బొంగు వెంకటనాయుడు(56) శుక్రవారం ఉదయం తన కుమార్తె లావణ్య పార్వతీపురంలో బీసీస్సీ పరీక్ష రాసేందుకు బైక్‌పై తీసుకొచ్చి గరుగుబిల్లిలో బస్సు ఎక్కించారు. తిరిగి ఇంటి కి వెళ్తుండగా గరుగుబిల్లి మండలంలోని రావుపల్లి–కొత్తపల్లి గ్రామాల మధ్య ఉన్న వెంకట శివ దుర్గ రైస్‌మిల్లు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమా దంలో లారీ కింద పడి అక్కడకక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో ద్విచ క్ర వాహనం పూర్తి దెబ్బతింది. తండ్రి మృతి వార్త తెలుసుకున్న కుమార్తె, కుటుంబ సభ్యు లు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుపెట్టారు. సమాచారం అందుకున్న గరుగుబిల్లి ఎస్‌ఐ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పార్వతీ పు రం జిల్లా ఆస్పత్రిలో పోస్టుమార్గం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ ఈశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. మృతుడు వెంకటనాయుడు బలిజిపేట జూనియర్‌ కళాశాలలో అటెండర్‌గా (ఎంటీఎస్‌ పద్ధతిలో) పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. వెంకటనాయుడు మృతిపై గ్రామస్తులు, సహోద్యోగులు సంతాపం తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement