పార్వతీపురం: జిల్లాలో జూన్ 7 నుంచి 21వ తేదీ వరకు ‘యోగాంధ్ర – 2026’ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకరరెడ్డి శుక్రవారం తెలిపారు. ‘ఒక జిల్లా–ఒకే ఇతివృత్తం’ నినాదంతో యోగా ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు, పోటీలు నిర్వహించనున్నట్లు చెప్పారు. జూన్ 11న తోటపల్లిలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం, జూన్ 15న సీతంపేటలోని ఎన్‌టీఆర్ అడ్వెంజర్ పార్క్, జూన్ 20న పాలకొండ, పార్వతీపురం, సాలూ రులలో ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వ హిస్తామని పేర్కొన్నారు. జూన్ 21న పార్వతీ పురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జిల్లాస్థాయిలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
పార్వతీపురం రూరల్: భావితరాలకు సురక్షితమైన భూమిని అందించేందుకు ప్రతి పౌరుడూ పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని జిల్లా రెండవ అదనపు న్యాయమూర్తి ఎం.మాధురి అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం పార్వతీపు రం మన్యం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు, న్యాయవాదులు కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు. అనంత రం ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. ప్లాస్టిక్ వినియోగ నియంత్రణ, నీటి సంరక్షణ, చెట్ల పెంపకం, వ్యర్థాల సక్రమ నిర్వహణ ద్వారానే పర్యావరణాన్ని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో భాగంగా పర్యావరణ పరిరక్షణపై సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించి, కోర్టు ప్రాంగణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం. శ్రీనివాసరావు పాల్గొన్నారు.


