చంద్రబాబు రెండేళ్ల మోసపూరిత పాలనపై జనం నిరసన చంద్రబాబు విజన్.. మోసం నిజం హామీల అమలులో టీడీపీ కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలం ‘వెన్నుపోటు పాలనకు రెండేళ్లు’ పేరిట జిల్లావ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నిరసనలు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో, హామీల బాండ్ల ప్రతులు దహనం
హామీలతో ఊరించారు.. నమ్మేలా ప్రచారం చేశారు.. ఓట్లు దండుకున్నాక దగాకోరు పాలనతో నమ్మినవారిని నయవంచనకు గురిచేశారు. ఆడబిడ్డ నిధి లేదు.. జాబ్ క్యాలెండర్ విడుదల లేదు.. నిరుద్యోగ భృతి ఊసేలేదు.. ఫీజురీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాస్త పెండింగ్ పథకంగా మార్చేశారు.. ఉచిత పంటల బీమాకు మంగళం పాడేశారు.. పింఛన్లు, ఇళ్లు, స్థలాల మంజూరు మాటనే మరిచారు.. కార్మిక, కర్షక, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంక్షేమాన్ని విస్మరిస్తూ.. అభివృద్ధిని పక్కనపెట్టి, నిత్యావసర సరుకుల ధరల నియంత్రణను పట్టించుకోకుండా, అమరావతి పేరుతో ప్రజాధనం లూటీ చేస్తూ, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెడుతున్న మీ రాక్షసపాలనకో దండం. మీ దగాకోరు పాలన మాకొద్దంటూ జనం నినదించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రోడ్లపై నిరసన ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై నిరసన గళం వినిపించారు. సూపర్ సిక్స్ అంటూ మోసం ఫిక్స్‌చేసిన తీరును ఎండగట్టారు.
చంద్రబాబు వెన్నుపోటు పాలనపై పార్వతీపురంలో మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
చంద్రబాబు రెండేళ్ల నయవంచక పాలనపై కురు పాం నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు శత్రుచర్ల పరీక్షిత్‌రాజు, మాజీ ఉపముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యులు పాముల పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలిపారు. తొలుత గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో ముఖద్వారం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దనున్న వైఎస్సార్ విగ్రహం వరకు భారీ సంఖ్యలో హాజరై న నాయకులు, కార్యకర్తలతో కలిసి పుష్పశ్రీవాణి, పరీక్షిత్‌రాజు ర్యాలీగా వెళ్లారు. అక్కడ చంద్రబాబు అందించిన మోసపూరిత బాండ్లను, మేనిఫెస్టో ప్రతులు, ప్రకటనలను దహనం చేశారు. గరుగుబిల్లి, జియ్యమ్మవలస, కొమరాడ మండల కేంద్రాల్లోనూ ఆయా మండల నాయకులు, వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు నిర్వహించారు. కురుపాం మండల కేంద్రంలో ర్యాలీ అనంతరం మేనిఫెస్టో ప్రతులను నాయకు లు దహనం చేస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నా రు. కాసేపు అంతరాయం కలిగించినా పార్టీ శ్రేణులు కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి.


