చంద్రబాబు ప్రజావ్యతిరేక పాలనపై సాలూరు నియోజకవర్గంలో నిరసన పెల్లుబికింది. మాజీ ఉప ముఖ్యమంత్రి, పార్టీ పీఏసీ సభ్యులు పీడిక రాజన్నదొర ఆధ్వర్యంలో సాలూరు మండలం మామిడిపల్లి, పాచిపెంట, మెంటాడ మండల కేంద్రాల్లో వందలాది మంది నిరసన ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వ ప్రజావ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మీ పాలనకో దండం అంటూ నినదించారు. మెంటాడలో జరిగిన కార్యక్రమంలో రాజన్నదొర పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వ ఎన్నికల మేనిఫెస్టో ప్రతులను, బాండ్లను మంటల్లో వేసి తగలబెట్టారు.


