పార్వతీపురం రూరల్: ప్రాథమిక దశలోనే విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) పి.బ్రహ్మాజీరా వు సూచించారు. పార్వతీపురం డీవీఎం మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ప్రాథమిక ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన ఆరు రోజుల ’ఎఫ్‌ఎల్‌ఎన్’ శిక్షణను గురువారం ఆయన ప్రారంభించారు. ఒకటి, రెండు తరగతుల విద్యార్థులకు తెలుగు, ఆంగ్లం ధారాళంగా చదవడం, రాయడంతో పాటు గణితంలోని చతుర్విద ప్రక్రియలపై అవగాహన కల్పించడమే శిక్షణ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి బి.రాజ్‌కుమార్, బలిజిపేట ఎంఈఓ, కోర్స్ డైరెక్టర్ సామల సింహాచలం, ఎస్సీఈఆర్టీ పరిశీలకులు సురేష్‌కు మార్, ఏఎంఓ కోటేశ్వరరావు, ఎంఈఓలు వై.విమలకుమారి, సూరి దేముడు, ప్రసాదరావు, మువ్వల వెంకటరమణ, ప్రథంసంస్థ కో–ఆర్డినేటర్ కిరణ్, కేఆర్పీలు వనజాక్షి, రవికుమార్, డీఆర్పీలతో పాటు 260 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


