గజపతినగరం రూరల్: మండలంలోని మధుపాడ 26వ నంబర్ జాతీయ రహదారి వద్ద బుధవారం అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న రెండు లారీలు ఢీకొన్న సంఘటనలో ఓ లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి.
ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఉన్నాయి. బుధవారం అర్ధరాత్రి సాలూరు నుంచి వస్తున్న లారీ, ఎదురుగా విజయనగరం నుంచి వస్తున్న లారీ మధుపాడ జాతీయరహదారి వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో సాలూరు నుంచి వస్తున్న కేరళ ప్రాంతానికి చెందిన లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రోడ్డుకు అడ్డంగా ఉన్న లారీలను పోలీసులు క్రేన్ సహాయంతో పక్కకు తీశారు.


