చమురు సెగ! | - | Sakshi
Sakshi News home page

చమురు సెగ!

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026 ప్రజారవాణాకు.. చమురు సెగ!

న్యూస్‌రీల్‌

పెరిగిన డీజిల్‌ ధరలతో అయోమయంలో ఆర్టీసీ ఇం‘ధన’ భారం మేసేందుకు ప్రభుత్వం ససేమిరా చార్జీలు పెంచే యోచనలో సర్కారు! ఇప్పటికే అరకొర బస్సులతో అవస్థలు ఆందోళలో ప్రయాణికులు, సామాన్యులు

సరుకు

రవాణాకూ

తిప్పలే..

గురువారం శ్రీ 4 శ్రీ జూన్‌ శ్రీ 2026
ప్రజారవాణాకు..

సాక్షి, పార్వతీపురం మన్యం:

మూలిగే నక్కపై తాటిపండు పడిన చందాన ఉంది ఆర్టీసీ తీరు. ఇప్పటికే బస్సులు ఫుల్‌ అవుతున్నా.. ఆదాయం లేక, అవస్థలు పడుతున్న ప్రజా రవాణా వ్యవస్థకు చమురు ధరల సెగ తాకుతోంది. 15 రోజుల వ్యవధిలోనే డీజిల్‌ ధర నాలుగు సార్లు పెరిగింది. సుమా రు రూ.8 మేర అదనపు భారం పడటంతో ఆర్టీసీ కుదేలవుతోంది. ప్రస్తుతం జిల్లాలో డీజిల్‌ ధర లీట రు రూ.105.90 పైసలు ఉంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల కారణంగా ఇప్పటికే డీజిల్‌ సక్రమంగా లభించడం లేదు. దీనికి తోడు క్రూడ్‌ ఆయిల్‌ ధర రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో ఆయిల్‌ కంపెనీలు ఆ భారాన్ని వినియోగదారులపై మోపుతున్నాయి. గతనెల 16వ తేదీ వరకూ డీజిల్‌ లీటరు రూ.98.01 ఉండేది. రెండు వారాల కాలంలోనే రూ.8 పెరిగింది. రానున్న రోజుల్లో చమురు ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ధరల తగ్గింపునకు ప్రభుత్వ చర్యలు శూన్యంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ టో, ఇతర రవాణా వాహనాలకు సంబంధించి చార్జీ లు పెంచేశారు. పెరిగిన డీజిల్‌ ధరలను సాకుగా చూపుతూ అదనంగా వసూలు చేస్తున్నారు. ప్రస్తు తానికి ఆర్టీసీ చార్జీలు పెరగనప్పటికీ.. రానున్న రో జుల్లో సంస్థకు గడ్డు కాలం తప్పదని.. ఈ నేపథ్యంలో చార్జీల భారం మోయాల్సి వచ్చినా ఆశ్చర్యం లేదని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు. కిలోమీటరుకు రూ.4 నుంచి రూ.5 వరకూ పెంచే అవకాశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు సమాచారం.

అరకొర బస్సులతో తప్పని అవస్థలు

ఉచిత బస్సు ప్రభావంతో ఆర్టీసీ సర్వీసులు కిక్కిరిసిపోతున్నాయి. సరిపడినన్ని బస్సులను వేయకపోవడం, పలు సర్వీసులను రద్దు చేయడంతో ఆర్టీసీలో ప్రయాణం ప్రహసనంగా మారింది. పురుష ప్రయాణికులు ప్రత్యామ్నాయ ప్రయాణ ఏర్పాట్లకే మొగ్గుచూపుతున్నారు. బస్సులు ఎక్కేందుకు ఇష్టపడడంలేదు. దీనికి తోడు రానున్న రోజుల్లో మరిన్ని సర్వీసులకు బ్రేక్‌ వేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రజారవాణాపై ఆధారపడిన వారు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

రోజుకు 92 వేల కిలోమీటర్ల ప్రయాణం

జిల్లాలో పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసీ డిపోలున్నాయి. వీటి పరిధిలో 240 బస్సులు నడుస్తున్నాయి. రోజూ 92 వేల కిలోమీటర్ల మేర రాకపోకలు సాగిస్తున్నాయి. దాదాపు 1.25 లక్షల మంది ప్రయాణం సాగిస్తున్నారు. ఆర్టీసీ బస్సుకు సగటున అయిదు నుంచి ఆరు కిలోమీటర్లలోపు మైలేజీ వస్తుంది. ఈ లెక్కన రోజుకు రూ.1.50 లక్షల మేర సంస్థపై అదనపు భారం పడుతోంది. ఆర్టీసీపై డీజిల్‌ రూపంలో పడిన అదనపు భారం మోసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం సమస్యగా మారింది. ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది. మరోవైపు ప్రభుత్వం టికెట్ల ధర పెంచేందుకు మొగ్గుచూపుతోందన్న వార్తలతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. చాలా గ్రామాలకు ఇప్పటికీ పల్లెవెలుగు డొక్కు బస్సులు మాత్రమే వెళ్తున్నాయి. చార్జీలు పెంచితే సామాన్యుడి జేబుకు చిల్లు పడటం ఖాయమన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.

చమురు ధరలు పెరగడం వల్ల ఆ ప్రభావం మార్కెట్లపైనా ఉంటుంది. సరుకు రవాణా చేసే వాహనాలు ఛార్జీల భారం వేస్తే వివిధ వస్తువులు, నిత్యవసర ధరలు కూడా పెరుగుతాయని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. సరుకులు రవాణా చేసే లారీ పరిశ్రమకు జిల్లాలోని సాలూరు ప్రసిద్ధి. ఇక్కడ సుమారు 2 వేల లారీల వరకు సరకు రవాణాపైనే ఆధారపడి ఉన్నాయి. ఇప్పటికే చమురు కొరతతో లారీలకు డీజిల్‌ దొరకడమే కష్టం అవుతోందని యజమానులు చెబుతున్నారు. ధరలు పెరగడం వల్ల మరింత భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement