మక్కువ: ఏనుగుల గుంపు సంచారంతో ప్రజల కు, పంటలకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని డీఎఫ్‌ఓ ప్రసూన అటవీశాఖ సిబ్బందిని ఆదేశించారు. మక్కువ మండలం మార్కొండపుట్టి పంచాయతీ వీరాడవలస గ్రామ సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును ఆమె బుధవారం పరిశీలించారు. ఇంతవరకు పంటలు, ప్రజలకు కలిగిన నష్టం వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏనుగుల గుంపు దిశ మార్చిన తర్వాత పంటల నష్టం వివరాలను సేకరిస్తున్నామని డీఎఫ్‌ఓకు వివరించారు. కార్యక్రమంలో ఎలిఫెంట్ మానిటరింగ్ యూనిట్ అధికారి కె.మణికంటేష్, అ టవీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
వీరఘట్టం: ప్రాథమిక స్థాయిలో విద్యాప్రమాణాల పెంపులో భాగంగా రాష్ట్ర సమగ్రశిక్ష జ్ఞాన ప్రకాష్ ఎల్.ఎల్.ఎన్ ప్రొగ్రాంకు మూడేళ్ల కిందట శ్రీకారం చుట్టింది. 2020 జాతీ య విద్యాహక్కు చట్టం ప్రకారం ఒకటి, రెండు తరగతులు చదువుతున్న విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించేందుకు ఎస్జీటీలకు బోధనా నైపుణ్యాలపై శిక్షణ ఇస్తోంది. అందులో భాగంగా ఈ ఏడాది కూడా జ్ఞాన ప్రకాష్ శిక్షణ కార్యక్రమాన్ని జిల్లాలో ఈ నెల 4 నుంచి 9వ తేదీ వరకు నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తిచేసింది. పాలకొండలోని జిల్లా పరిషత్ హైస్కూల్, కురుపాంలో ని ఏపీఎంఎస్ స్కూల్, సాలూరులోని బాలికోన్నత పాఠశాల, పార్వతీపురంలోని డీవీఎంఎం హైస్కూల్‌తో పాటు ఉల్లిభద్రలోని జిల్లా పరిషత్ హైస్కూల్‌లో శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఆయా నియోజకవర్గ పరిధిలో ఉన్న ఎస్జీటీలు శిక్షణ తరగతుల్లో పాల్గొంటారు.
పార్వతీపురం రూరల్: జిల్లా ఈపీడీసీఎల్ ఆపరేషన్ సర్కిల్ నూతన ఎస్‌ఈగా పి.త్రినాథరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం సర్కిల్ డీఈగా పనిచేసి న ఆయన పదోన్నతిపై ఇక్కడికి వచ్చారు. పార్వతీపురం ఈఈగా ఆర్.రామునాయుడు సైతం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ.. ‘సూర్య ఘర్’ను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. విద్యుత్ సమస్యలు, అంతరాయాలు ఏర్పడితే వినియోగదారులు 1912 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని, సిబ్బంది వాటిని పరిష్కరిస్తారని తెలిపారు.
ఆర్‌కే టౌన్‌షిప్ గ్రూప్ 34 ఏళ్ల విజయోత్సవం
విశాఖపట్నం: రియల్ ఎస్టేట్ రంగంలో 34 సంవత్సరాలుగా విశ్వసనీయ సేవలు అందిస్తూ వేలాది కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసిన ఆర్‌కే టౌన్‌షిప్ గ్రూప్ తన 34వ వార్షికోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.జి.అమర్‌నాథ్ మాట్లాడుతూ 1992లో స్థాపితమైన ఆర్‌కే టౌన్‌షిప్ గ్రూప్ పారదర్శకత, నాణ్యత, నిబద్ధత అనే విలువలను పాటిస్తూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థగా గుర్తింపు పొందిందన్నారు. విశాఖపట్నం, గాజువాక, హైదరాబాద్, విజయవాడ, రాజమహేంద్రవరం కేంద్రాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తూ అనేక విజయవంతమైన వెంచర్లను అభివృద్ధి చేసిందన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య గార్డెన్స్, గౌతమి గార్డెన్స్, ఆర్‌కేస్ గ్రాండ్యూర్ సిటీ, గ్రీన్ వ్యాలీ 5డి, నారాయణి గార్డెన్స్ వంటి ప్రాజెక్టులు విజయవంతంగా కొనసాగుతున్నాయని తెలిపారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, గూగుల్ డేటా సెంటర్ పరిసర ప్రాంతాల్లో త్వరలోనే మరిన్ని ప్రతిష్టాత్మక వెంచర్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సంస్థ సీనియర్ మేనేజర్లు పి.ఆర్.కె.వెంకటేష్, బి.అప్పారావు, మేనేజర్లు బి.బాలాజీ, పి.వేణుగోపాల్, సీనియర్ మార్కెటింగ్ జనరల్ మేనేజర్లు, మార్కెటింగ్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.


