మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

Jun 4 2026 5:10 AM | Updated on Jun 4 2026 5:10 AM

మహిళా రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి

పార్వతీపురం రూరల్‌: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని, జనాభా పెంపుదలపై ముఖ్యమంత్రి చేసిన ప్రకటనను ఉపసంహరించుకోవాలని అఖిలపక్ష మహిళా, ప్రజా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. ఐద్వా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఆర్‌.శ్రీదేవి అధ్యక్షతన బుధవా రం నిర్వహించిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కె.సుబ్బరావమ్మ, ఐద్వా జిల్లా కార్యదర్శి బి.లక్ష్మి తదితరులు మాట్లాడారు. 2023 నాటి మహిళా బిల్లును నియోజకవర్గాల పునర్విభజనతో ముడిపెట్టకుండా ప్రత్యేక ఆర్డినెన్స్‌తో వెంటనే అమలు చేయాలన్నారు. మూడు, నాలుగు సంతానానికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తా మన్న ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మహిళల ఆరోగ్యం, స్వేచ్ఛను దెబ్బతీసేలా ఉన్నాయని ఆక్షేపించారు. స్థానాల పెంపు కోసం కాకుండా, సంతానోత్పత్తిని తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయానికే వదిలేయాలని పేర్కొన్నారు. సమావేశంలో వివిధ సంఘాల నాయకులు వి.ఇందిర, గౌరీమణి, గౌరి, కె.గంగునాయుడు, బి.వి.రమణ, జి.వెంకటరమణ, సుందర మ్మ, భాస్కరరావు, ఆర్‌.వి.ఎస్‌.కుమార్‌, బి.సూరిబాబు, పి.సంఘం, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement