స్క్రీనింగ్‌ పరీక్షలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

స్క్రీనింగ్‌ పరీక్షలు ప్రారంభం

Jun 3 2026 12:33 AM | Updated on Jun 3 2026 12:33 AM

పార్వతీపురం: జిల్లాలో 0–6 సంవత్సరాల పిల్లల ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఏఐ ఆధారిత ఈసీడీ స్క్రీనింగ్‌ పరీక్షలను కలెక్టర్‌ డా. ఎన్‌. ప్రభాకరరెడ్డి మంగళవారం ప్రారంభించారు. కలెక్టరేట్‌ పీజీఆర్‌ఎస్‌ మందిరంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పోషణ్‌ ట్రాకర్‌ డేటా విశ్లేషణ, పిల్లల 100 శాతం హాజరు, ఆటలు–వ్యాయామాల నిర్వహణపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ప్రతి నెల ‘స్మార్ట్‌ ముస్తాబ్‌ – హెల్తీ బాయ్‌, హెల్తీ గర్ల్‌’ పోటీలను నిర్వహించి ఆరోగ్యవంతమైన పిల్లలను ప్రోత్సహించాలన్నారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ టి.కనకదుర్గ, డీఎంహెచ్‌ఓ భాస్కరరావు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement