కొద్ది రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు.. బిందెడు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నాం.. సువర్ణముఖి నదికి పరుగుతీస్తున్నా బురదనీరే గతి అవుతోంది... తాగునీటి కష్టాలు తీర్చాలని అధికారులకు ఫిర్యాదుచేసినా పట్టించుకోలేదు... ఇదెక్కడి అన్యాయం ‘బాబూ’ అంటూ సీతానగరం మండలంలోని పెదంకలాం గ్రామస్తులు మంగళవారం ఆందోళన చేశారు. ఖాళీ బిందెలతో సచివాలయాన్ని మంగళవారం ముట్టడించారు. అక్కడే కాసేపు నిరసన తెలిపారు. ఈ విషయంపై పంచాయతీ అభివృద్ధి అధికారి గౌరీశ్వరి స్పందిస్తూ వాటర్ స్కీమ్ మోటారు కాలిపోవడంతో తాగునీటి సమస్య తలెత్తిందని, మోటారుకు మరమ్మతులు చేయించామని, టెక్నీషియన్‌తో అమర్చి రెండు రోజుల్లో తాగునీటి సరఫరాను పునరుద్ధరిస్తామన్నారు.
– సీతానగరం


