కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తరువాత పంటల సాగుకు పెట్టుబడిసాయం కోసం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో సకాలంలో నిధులు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
నిమ్మక కాంతారావు, గిరిజన రైతు,
దేవనాపురం
మధ్యతరగతికి కష్టమే
జూన్‌నెల వచ్చిందంటే మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికభారం తప్పదు. మరికొద్ది రోజుల్లో పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో పుస్తకాలు, యూనిఫాం, కొనుగోలు చేయక తప్పదు. మిగిలిన నెలలతో పోలిస్తే జూన్ నెల ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇటు చదువులకు, అటు వ్యవసాయానికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఎన్.అరుణ, మాజీసర్పంచ్, టిటుకుపాయి


