ఘనంగా పైడితల్లి చండీయాగం | - | Sakshi
Sakshi News home page

ఘనంగా పైడితల్లి చండీయాగం

Jun 1 2026 12:44 AM | Updated on Jun 1 2026 12:44 AM

ఘనంగా పైడితల్లి చండీయాగం

విజయనగరం టౌన్‌: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీయాగం ఆదివారం శాస్త్రోక్తంగా జరిగింది. వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, అర్చకుడు నేతేటి ప్రశాంత్‌లు అమ్మవారికి పూజాదికాలు, యాగప్రక్రియను నిర్వహించారు. యాగ విశిష్టతను భక్తులకు వివరించారు. పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవారికి యాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని అర్చకులు తెలిపారు. యాగంలో పాల్గొన్న భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, తీర్ధప్రసాదాలను అందజేశారు. కార్యక్రమాలను ఆలయ ఈఓ కె.శిరీష పర్యవేక్షించారు.

Advertisement
 
Advertisement
Advertisement