లైన్‌మన్‌కు తీవ్రగాయాలు | - | Sakshi
Sakshi News home page

లైన్‌మన్‌కు తీవ్రగాయాలు

Jun 1 2026 12:44 AM | Updated on Jun 1 2026 12:44 AM

విద్యుత్‌ స్తంభంపైనుంచి జారిపడి ప్రమాదం

వీరఘట్టం: మండలంలోని తెట్టంగిలో జూనియర్‌ లైన్‌మన్‌గా పనిచేస్తున్న సవర సోమేష్‌ ఆదివారం విద్యుత్‌ పనులు చేస్తుండగా స్తంభంపై నుంచి జారి పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీనిపై స్థానికులు,,,ట్రాన్స్‌కో సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామంలోని ఓ ఇంటికి విద్యుత్‌ సరఫరా లేకపోవడంతో స్తంభం పైన ఉన్న సర్వీస్‌ వైర్‌ పరిశీలించేందుకు ఎక్కాడని, ఆ సమయంలో ఆ ఇంటిలో ఉన్న ఇన్వర్టర్‌ సప్‌లై రిటర్న్‌ రావడంతో సోమేష్‌కు స్వల్ప షాక్‌ తగిలి కింద ఉన్న సీసీ రోడ్డుపై పడిపోయినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో లైన్‌మన్‌ సోమేష్‌ తల సీసీ రోడ్డుకు బలంగా తగలడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన వీరఘట్టం ఏఈ సోమేశ్వరరావు, సహచర సిబ్బంది శ్రీకాకుళంలోని కిమ్స్‌ ఆసుపత్రికి వైద్య చికిత్స కోసం లైన్‌మన్‌ను తరలించారు.ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఆపరేషన్‌ చేస్తే గానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నట్లు ఏఈ సోమేశ్వరరావు తెలిపారు. సీతంపేట మండలం చాకలిగూడకు చెందిన సోమేష్‌ రెండేళ్ల క్రితం ఇక్కడికి బదిలీపై వచ్చాడని ఏఈ తెలిపారు.

ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రం రామనారాయణం ప్రాంగణంలో ఆదివారం చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది. పౌర్ణమి రోజును పురస్కరించుకుని విజయనగరానికి చెందిన శ్రీ వర్థి నృత్యాలయం బృంద చిన్నారుల ప్రదర్శనలు అందరినీ అలరించాయి. అనంతరం చిన్నారులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement