బడిఈడు పిల్లలంతా ప్రభుత్వ బడిలో ఉండాలి | - | Sakshi
Sakshi News home page

బడిఈడు పిల్లలంతా ప్రభుత్వ బడిలో ఉండాలి

May 31 2026 12:42 AM | Updated on May 31 2026 12:42 AM

బడిఈడు పిల్లలంతా ప్రభుత్వ బడిలో ఉండాలి

విజయనగరం అర్బన్‌: బడిఈడు పిల్లలంతా ప్రభుత్వ బడిలో ఉండాలని ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని వేణుగోపాలపురం ప్రభుత్వ డైట్‌(జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థ) కళాశాల అధ్యాపకులు వి.చిన్నంనాయుడు, ఐఎస్‌ఈ శర్మ, బీవీ గోపాలకృష్ణ, కె.అప్పారావు అన్నారు. బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా స్థానిక పట్టణంలోని గాజులరేగ, కాట, మంగళ వీధుల్లో శనివారం పర్యటించిన వారు..ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు. ప్రభుత్వ బడుల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులతో నాణ్యమైన విద్యాబోధన చేయడం జరుగుతుందని, ఉచితంగా పాఠ్యపుస్తకాలు, యూనిఫాం, మధ్యాహ్న భోజనం అందించడం జరుగుతుందన్నారు. 23 మంది విద్యార్థులు దాసన్నపేట, మున్సిపల్‌ ఉన్నత పాఠశాలల్లో చేరేందుకు ముందుకువచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement