ధూమపానం ఆరోగ్యానికి హానికరం | - | Sakshi
Sakshi News home page

ధూమపానం ఆరోగ్యానికి హానికరం

May 31 2026 12:42 AM | Updated on May 31 2026 12:42 AM

నెల్లిమర్ల రూరల్‌: ధూమపానం(పొగతాగడం) ఆరోగ్యానికి హానికరమని, ప్రతిఒక్కరూ ధూమపానానికి దూరంగా ఉండాలని ఎంఎల్‌హెచ్‌వో భాగ్యలక్ష్మి అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం పురస్కరించుకుని, మండలంలోని కొండగుంపాం గ్రామంలో వైద్యారోగ్య సిబ్బంది శనివారం ర్యాలీ నిర్వహించి, పొగాకు వల్ల కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించారు. పొగాకు తాగడం లేదా పీల్చడం వల్ల, పొగాకు ఉత్పత్తులు తినడం వల్ల ఊపిరితిత్తులు, గుండె కేన్సర్‌లు వచ్చే ప్రమాదం ఉందని తెలిపారు. సిగరెట్లు, ఖైనీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు ప్రతిఒక్కరూ దూరంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement