పారిశుధ్య కార్మికులకు.. ఆ మాత్రం రక్షణ ఇవ్వలేరా? | - | Sakshi
Sakshi News home page

పారిశుధ్య కార్మికులకు.. ఆ మాత్రం రక్షణ ఇవ్వలేరా?

May 31 2026 12:42 AM | Updated on May 31 2026 12:42 AM

పారిశుధ్య కార్మికులకు.. ఆ మాత్రం రక్షణ ఇవ్వలేరా?

సమాజ ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన సేవలందిస్తున్న పారిశుధ్య కార్మికుల ఆరోగ్యం, రక్షణపై అటు ప్రభుత్వం, ఇటు అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనునిత్యం మురుగు, చెత్తాచెదారం, దుమ్మూ–ధూళి ఉండే చోట్ల పనిచేసే వీరు..రక్షణ పరికరాలేవీ ధరించకుండా పనిచేయడాన్ని చూసి పారిశుధ్య కార్మికులంటే ఇంత చిన్నచూపా? అని అంటున్నారు. కనీసం తలకు టోపీ, ముఖానికి మాస్క్‌, చేతికి గ్లౌజులు, కాళ్లకు బూట్లు, శరీరాన్ని కప్పి ఉంచే యాప్రాన్‌ను అందివ్వలేరా అని ప్రశ్నిస్తున్నారు. వారంతా శ్వాసకోశ, ఊపిరితిత్తులు, చర్మ వ్యాధుల బారినపడితే ఎవరు బాధ్యులని నిలదీస్తున్నారు. సమావేశాల్లో ఆరోగ్య ప్రదాతలుగా వారిని కీర్తించడం కాదని, వారి ఆరోగ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే వారికి రక్షణ పరికరాలు అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

– సాక్షి ఫొటోగ్రాఫర్‌, విజయనగరం

Advertisement
 
Advertisement
Advertisement