మహిళలకు గౌరవం ఉన్నచోటే నాగరిక సమాజం | - | Sakshi
Sakshi News home page

మహిళలకు గౌరవం ఉన్నచోటే నాగరిక సమాజం

May 30 2026 2:56 AM | Updated on May 30 2026 2:56 AM

గుమ్మలక్ష్మీపురం: మహిళలకు గౌరవం ఉన్నచోటే నాగరిక సమాజం ఉన్నట్లని ఎస్పీ మాధవ్‌రెడ్డి అన్నారు. మహిళలను చులకన భావంతో చూడకూడదన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలపై గుమ్మలక్ష్మీపురం బీఎస్సార్‌ కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రతి మహిళ తన సెల్‌ఫోన్‌లో శక్తియాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. మహిళలు మంచి చదువులు చదువుకొని ఆర్థికంగా ఎదుగాలని సూచించారు. కార్యక్రమంలో పాలకొండ డీఎస్పీ రాంబాబు, ఎల్విన్‌పేట సీఐ హరి, ఎస్‌ఐ శివప్రసాద్‌ నాయుడు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement