డైట్‌లో టీచ్‌ టూల్స్‌పై శిక్షణ | - | Sakshi
Sakshi News home page

డైట్‌లో టీచ్‌ టూల్స్‌పై శిక్షణ

Mar 13 2026 7:47 AM | Updated on Mar 13 2026 7:47 AM

డైట్‌లో టీచ్‌ టూల్స్‌పై శిక్షణ

నెల్లిమర్ల: స్థానిక వేణుగోపాలపురంలోని జిల్లా ఉపాధ్యాయ విద్య శిక్షణ సంస్థలో టీచ్‌ టూల్స్‌ శిక్షణ కార్యక్రమం గురువారం జరిగింది. కళాశాలలో గత నెల 28 నుంచి ఈ నెల 12 వరకు రెండవ దశ టీచ్‌ టూల్‌ శిక్షణ కార్యక్రమం జరిగినట్టు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ దత్తి అప్పలనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఆదేశానుసారం డైట్‌ ఫ్యాకల్టీ పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాల్సిన అంశాలపై శిక్షణ ఇచ్చామని తెలిపారు. అలాగే టీచ్‌ టూల్‌ రిసోర్స్‌పర్సన్‌ రమేష్‌ బాబు, పద్మజ మాట్లాడుతూ తరగతి గది పరిసరాలు, సమదృష్టితో బోధన విధానం, విద్యార్థుల సానుకూల ప్రవర్తన, అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచన, సహచర విద్యార్థుల పరస్పర నైపుణ్య మార్పిడి, అంశాల వారి ప్రతిస్పందన దృష్టిలో ఉంచుకుని ప్రధానంగా పాఠశాలల సందర్శన సమయంలో పరిశీలించాలని ఐఎఫ్‌ ప్యానల్‌లో వీడియోలతో శిక్షణలో వివరించారు. స్టాఫ్‌ సెక్రటరీ వాక చిన్నంనాయుడు, ఫ్యాకల్టీ రమేష్‌, మురళి, సూరిబాబు, శ్రీనివాసరావు, అన్నారావు, అప్పారా వు, లక్ష్మణరావు, సత్యారావు, రజిత, సౌమ్య, సూర్యకళ, శర్మ, సోమయాజులు, శశి భూషణ్‌, గోపాలకృష్ణ, ఉమా మహేష్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement