
సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు ఆహ్వానం
విజయనగరం టౌన్: మహారాజా ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ కేఏవీఎల్ఎన్. శాస్త్రి శుక్రవారం కళాశాల కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో తెలిపారు. నాలుగేళ్ల సర్టిఫికెట్ కోర్సుతో పాటు రెండేళ్ల డిప్లమో కోర్సులో శిక్షణ ఉంటుందన్నారు. సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన వారు మాత్రమే డిప్లమో కోర్సుల్లో చేరేందుకు అర్హులన్నారు. కళాశాలలో గాత్రం, వీణ, వయోలిన్, నాదస్వరం, మృదంగం, డోలు, భరతనాట్యం కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నామని, అభ్యర్థుల వయస్సు 10 ఏళ్లు నిండి 60 ఏళ్లలోపు ఉండాలన్నారు. దరఖాస్తులను కళాశాల సమయవేళల్లో అందజేయాలని సూచించారు. ఆసక్తి గల విద్యార్థులు ఫోన్ 08922–223751 నంబర్లో కానీ నేరుగా కళాశాలలో గానీ సంప్రదించాలని కోరారు.