
ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట
విజయనగరం అర్బన్:
ఆంధ్రయూనివర్సిటీ పరిధిలోని ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో ఎంటెక్, ఎంఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన ఏపీపీజీఈసెట్–2025 ప్రవేశ పరీక్షలో ఉమ్మడి విజయనగరం జిల్లాకు చెందిన అభ్యర్థులు ఉత్తమ ప్రతిభ చూపారు. వివిధ గ్రూప్‌లలో టాప్ టెన్ ర్యాంక్‌లు సాధించారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, మెకానికల్, నానో ఇంజినీరింగ్ పీజీ కోర్సులలో ర్యాంకుల పంట పండించారు.
భరత్‌కు మూడో ర్యాంక్
నెల్లిమర్ల రూరల్: ఎంటెక్, ఎంఫార్మసీ, ఫార్మా డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ పీజీఈసెట్–2025 ఫలితాల్లో నెల్లిమర్ల మండలం అలుగోలు గ్రామానికి చెందిన కురిమినేని భరత్ నాయుడు ప్రతిభ చూపాడు. కెమికల్ ఇంజినీరింగ్ విభాగంలో 76 మార్కులు సాధించి విశాఖ ఆంధ్రా యూనివర్శిటీ పరిధిలో మూడో ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. ఉత్తమ ర్యాంక్‌ను సాధించిన విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామస్తులు అభినందించారు.
అంపిలి విద్యార్థి ప్రతిభ
పాలకొండ రూరల్: మండలంలోని అంపిలి గ్రామానికి చెందిన గేదల లక్ష్మీనారాయణ ఏపీ పీజీఈసెట్‌లో ఎలక్ట్రికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగంలో ఏయూ పరిధిలో రెండవ ర్యాంక్ సాధించాడు. విద్యార్థి తండ్రి అప్పలనాయుడు వ్యవసాయ కూలీకాగా, తల్లి పార్వతి మరణించారు. ఎలక్ట్రికల్ విభాగంలో ఉత్తమ పరిశోధనలు చేయాలన్న తపనతో చదువుసాగిస్తున్నట్టు లక్ష్మీనారాయణ తెలిపాడు.

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట

ఏపీ పీజీ ఈసెట్‌లో ర్యాంకుల పంట