మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌కు నివాళి

మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న సిబ్బంది      - Sakshi

పార్వతీపురం: భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా మైనార్టీ వెల్ఫేర్‌డే, జాతీయ ఎడ్యుకేషన్‌డేను శనివారం నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఆజాద్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారతదేశ స్వాతంత్య్రోద్యమంలో ఆయన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టర్‌ కార్యాలయ ఏఓ ఎం.ఉమామహేశ్వరరావు, సెక్షన్‌ అధికారి శ్రీరామూర్తి, మైనార్టీ ప్రతినిధి మహమ్మద్‌ లబ్దుల్‌ ఖుదుష్‌, క్రిస్టియన్‌ ప్రతినిధులు బిషప్‌ ఎన్‌.తిమోతి, ఎన్‌.సుధీర్‌ చంద్ర తదితరులు పాల్గొన్నారు.
 

Read also in:
Back to Top