న్యూస్‌రీల్
వేడెక్కిన రాజకీయం
జిల్లాలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ఇలా..
నేటి నుంచి కార్తిక మాసోత్సవాలు ప్రారంభం
జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు
● 26, 29, డిసెంబర్ 2న జరగనున్న
పల్లె పోరు
● పోలింగ్ రోజు సాయంత్రమే ఫలితాలు
● ఏర్పాట్లలో జిల్లా యంత్రాంగం నిమగ్నం
● తొలి విడతలో నరసరావుపేట
రెవెన్యూ డివిజన్
● ఒకేసారి మున్సిపల్,
పంచాయతీ ఎన్నికలు సాధ్యమేనా?
● జిల్లాలో 512 గ్రామ పంచాయతీలు,
5,286 వార్డులు
సత్తెనపల్లి/నరసరావుపేట రూరల్: జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు ముగిశాయి. ప్రాదేశిక సమరం పూర్తయ్యింది. ఫలితాలు వెలువడ్డాయి. ఇక మిగిలింది ‘పంచాయతీ’పోరే.. జిల్లాలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. జిల్లాలో 28 మండలాల పరిధిలో 512 గ్రామ పంచాయతీలు, 5,286 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. 5,340 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా వీటిల్లో 1,694 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు, 2,066 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. 12,36,776 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 6,08,095 మంది, మహిళలు 6,28,583 మంది, ఇతరులు 98 మంది ఉన్నారు. ఇప్పటికే మండలాలవారీగా రిజర్వేషన్లు ఖరారు చేసిన విషయం తెలిసిందే. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆధ్వర్యంలో అధికారులు ఎన్నికల ఏర్పాట్లు చేశారు. తుది ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల గుర్తింపు, బ్యాలెట్ బాక్సులు, ఇతర సామగ్రి సమకూర్చుకున్నారు. ఎన్నికలు మూడువిడతల్లో నిర్వహించనుండగా, ఉదయం 6.30గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్లలెక్కింపు ప్రారంభించి ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడించనున్నారు. ఉపసర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. ఏదైనా కారణంతో ఉప సర్పంచ్ ఎన్నిక జరగకుంటే మరుసటి రోజు ఎన్నుకుంటారు.
● తొలి విడతలో భాగంగా నరసరావుపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని 10 మండలా ల్లోని 228 గ్రామ పంచాయతీలకు, 2,290 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. నరసరావుపేట 26, రొంపిచర్ల 28, చిలకలూరిపేట 22, యడ్లపాడు 18, నాదెండ్ల 15, వినుకొండ 26, బొల్లాపల్లి 33, శావల్యాపురం 15, నూజండ్ల 27, ఈపూరు 18 పంచాయతీలకు ఈనెల 13న నోటిఫికేషన్ విడుదల చేసి ఈ నెల 26న ఎన్నికలు నిర్వ హించనున్నారు. అయితే నరసరావుపేట పట్టణానికి మున్సిపల్ ఎన్నికలు జరగనున్నందున అదే సమయంలో తొలి విడత నరసరావుపేట డివిజన్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించటం సాధ్యమేనా అన్న అంశం తెర పైకి వస్తోంది.
● రెండో విడత సత్తెనపల్లి రెవిన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 150 గ్రామ పంచాయతీలకు,1,562 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సత్తెనపల్లి 25, ముప్పాళ్ళ 14, రాజుపాలెం 18, నకరికల్లు 17, పెదకూరపాడు 17, అమరావతి 05, అచ్చంపేట 23, క్రోసూరు 18, బెల్లంకొండ 13 పంచాయతీలకు ఈ నెల 16న నోటిఫికేషన్ విడుదల కానుండగా ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి.
● మూడో విడత గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలోని 9 మండలాల్లో 134 గ్రామ పంచాయతీలకు,1,434 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. గురజాల12, దాచేపల్లి 14,మాచవరం 15,పిడుగురాళ్ల 16, మాచర్ల 16, దుర్గి 15, కారంపూడి 15, రెంటచింతల 11, వెల్దుర్తి 20 పంచాయతీలకు ఈ నెల 19న నోటిఫికేషన్ విడుదల కానుండగా డిసెంబర్ 2న ఎన్నికలు జరగను న్నాయి.
ముఖ్యమైన ఘట్టాలు మొదటి విడత రెండో విడత మూడో విడత
నోటిఫికేషన్ నవంబర్ 13 నవంబర్ 16 నవంబర్ 19
నామినేషన్ల స్వీకరణ నవంబర్ 15 నవంబర్ 18 నవంబర్ 21
చివరి తేదీ నవంబర్ 17 నవంబర్ 20 నవంబర్ 23
పరిశీలన నవంబర్ 18 నవంబర్ 21 నవంబర్ 24
అప్పీళ్లకు చివరి తేదీ నవంబర్ 19 నవంబర్ 22 నవంబర్ 25
అప్పీళ్ల పరిష్కరణకు చివరి తేదీ నవంబర్ 20 నవంబర్ 23 నవంబర్ 26
విత్ డ్రాకు చివరి తేదీ నవంబర్ 21 నవంబర్ 24 నవంబర్ 27
పోలింగ్/కౌంటింగ్ నవంబర్ 26 నవంబర్ 29 డిసెంబర్ 02
ఏఎన్‌యూ(పెదకాకాని): ఏఎన్‌యూలోని దూర విద్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పీజీ, యూజీ, డిప్లమా, సర్టిఫికెట్ ప్రోగ్రాం పరీక్షలు ఈనెల 11వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని దూర విద్యా కేంద్రం పరీక్షల కో–ఆర్డినేటర్ ఆచార్య దిట్టకవి రామచంద్రన్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరీక్షలు ఈనెల 20 తేదీ వరకు కొనసాగుతాయన్నారు. యూజీ 5వ సెమిస్టర్, పీజీ 4వ సెమిస్టర్, అన్ని రకాల డిప్లొమా, సర్టిఫికెట్, బీఎల్‌ఐసి, ఎంఎల్‌ఐసీ వార్షిక, సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కొనసాగుతాయని, 1 సెషన్ మాత్రమే పరీక్షలు ఉంటాయన్నారు. పరీక్షల నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 60 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ఎయిడెడ్ డిగ్రీ, జూనియర్ కళాశాలలో పరీక్షలు జరుగుతాయని వెల్లడించారు.
గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పల్లెల్లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. రిజర్వేషన్లు ఖరారు కావడంతో సర్పంచ్‌లు, వార్డు మెంబర్ల స్థానాల్లో బరిలో ఉండాలనుకున్న ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఇక ఆయా రాజకీయ పార్టీలు సైతం ఈ సర్పంచ్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని తమ మద్దతుదారుల్ని గెలిపించుకోవాలన్న పట్టుదలతో ఉన్నాయి. ఆయా పార్టీలు రిజర్వేషన్ కలిసి వచ్చిన అభ్యర్థుల కోసం వేట ప్రారంభించాయి.
హరిహరులకు అత్యంత ప్రీతికరం
భక్తుల పుణ్యస్నానాలతో సందడి
కనుల పండువగా దీపారాధనలు
శివారాధనకు సిద్ధమైన ఆలయాలు


