పోలీసు స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

పోలీసు స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

గురజాల: గురజాల పోలీస్‌ స్టేషన్‌ను జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి సోమవారం రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ రికార్డులను పరిశీలించారు. మండల పరిధిలోని సమస్యాత్మాక, అతి సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసులకు పలు సూచనలు చేశారు. సమస్యలు ఏవైనా ఉన్నాయా అని డీఎస్పీ మహేశ్వరరావు, సీఐ మురళీలను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను సక్రమంగా ఉంచుకోవాలన్నారు.

సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా

రెంటచింతల: త్వరలో జరగనున్న సర్పంచ్‌ల ఎన్నికలు ప్రశాంతంగా ముగిసే వరకు రెంటచింతల మండలంలోని ఆరు సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక నిఘా పెట్టాలని పల్నాడు జిల్లా ఎస్పీ జగదీష్‌ అదహళ్లి అన్నారు. సోమవారం రాత్రి స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా సందర్శించి మాట్లాడారు. గ్రామాలలో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రశాంత వాతావరణాన్ని కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఎవరైన పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లను భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి వారిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పోలీసు స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. ఎస్పీ వెంట గురజాల డీఎస్పీ ఎం.మహేశ్వరరావు, కారంపూడి సీఐ ఆవుల భాస్కర్‌, ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement