విద్యుదాఘాతంతో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో మహిళ మృతి

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

జలాలుపురంలో పండగ పూట విషాదం

పెదకూరపాడు: దీపావళి పర్వదినాన ఓ కుటుంబంలో విషాదం అలముకుంది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదకూరపాడు మండలం జలాలుపురం గ్రామానికి చెందిన మన్నవ సుశీల (53) దీపావళి పండుగను పురస్కరించుకుని ఇల్లు శుభ్రం చేసుకుని బట్టలు ఉతికేందుకు గ్రామంలోని తూర్పు వాగుకు ఆదివారం ఉదయం వెళ్లింది. మురసు తుపాను ప్రభావంతో తూర్పు వాగు వైపు ఉన్న 11 కేవీ విద్యుత్‌ తీగలు కొన్ని కిందకు వాలగా, మరికొన్ని కింద పడిపోయి ఉన్నాయి. బట్టలు ఉతుక్కుకొని తిరిగి వస్తున్న క్రమంలో మన్నవ సుశీల మెడకు విద్యుత్‌ తీగ తగిలి కింద ఉన్న విద్యుత్‌ వైర్లపై పడటంతో విద్యుత్‌ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందింది. బట్టలు ఉతికేందుకు వెళ్లిన సుశీల తిరిగి రాకపోవడంతో భర్త మన్నవ చిట్టియ్య తూర్పు వాగు వైపు వెళ్లే క్రమంలో విగత జీవిగా పడి ఉన్న భార్యను చూసి స్థానికులకు సమాచారం అందించారు. అప్పటికే సుశీల మృతి చెంది మెడ, కాళ్లు, ముందు భాగం మొత్తం కాలిపోయాయి. తుపాను ప్రభావంతో విద్యుత్‌ తీగల వేళపడుతున్నాయని విద్యుత్‌ శాఖ సిబ్బందికి తెలిపినా వారు నిర్లక్ష్యం వహించడంతో నిండు ప్రాణం బలైందని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతురాలికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement