ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం

Nov 10 2026 1:49 AM | Updated on Nov 10 2026 1:49 AM

ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించడమే లక్ష్యం

జిల్లా ప్రధాన న్యాయమూర్తి

బి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి

గుంటూరు లీగల్‌ : మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజలకు కూడా చట్టాలపై అవగాహన కల్పించడం న్యాయ సేవాధికార సంస్థ ముఖ్య ఉద్దేశమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ బి.సాయి కల్యాణ చక్రవర్తి అన్నారు. జాతీయ న్యాయ సేవా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా న్యాయ సేవాధికార సంస్థలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సయ్యద్‌ జియావుద్దీన్‌ అధ్యక్షత వహించారు. ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ప్రతి పౌరుడికి చట్టపరమైన న్యాయసహాయం సులభంగా అందుతుందని అన్నారు. లోక్‌ అదాలత్‌ ద్వారా మోటారు వెహికల్‌ ప్రమాదాలలో త్వరితగతిన న్యాయ సహాయం బాధిత కుటుంబాలకు అందజేస్తున్నామని, సివిల్‌ దావాలలో కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులలో కూడా ఎక్కువ సంఖ్యలో రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారానికి కృషి చేశామని అన్నారు. కావున ప్రజలందరూ న్యాయ సేవాధికార సంస్థ సేవలను, వారికి ఉన్న హక్కుల గురించి అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఒకటవ అదనపు జిల్లా జడ్జి వి.ఎ.ఎల్‌.సత్యవతి మాట్లాడుతూ కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాలత్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎం.నాగేశ్వరరావు, బార్‌ కౌన్సిల్‌ మెంబర్స్‌ వి.బ్రహ్మరెడ్డి, శాంతకుమార్‌లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ విధులపై అవగాహన కలిగించారు. కార్యక్రమంలో అదనపు జిల్లా జడ్జిలు, అదనపు సివిల్‌ జడ్జిలు (సీనియర్‌ డివిజన్‌), అదనపు సివిల్‌ జడ్జిలు (జూనియర్‌ డివిజన్‌), పారా లీగల్‌ వాలంటీర్స్‌, ప్యానెల్‌ అడ్వకేట్లు, లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సెల్‌ సిబ్బంది, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement