ఆ సీఐ.. పచ్చచొక్కా రావు! | - | Sakshi
Sakshi News home page

ఆ సీఐ.. పచ్చచొక్కా రావు!

Nov 3 2026 1:57 AM | Updated on Nov 3 2026 1:57 AM

ఆ సీఐ.. పచ్చచొక్కా రావు! ● మున్సిపల్‌ పోలింగ్‌ రోజున మధ్యాహ్నం 2:30 గంటల నుంచి టీడీపీ మూకలు యథేచ్ఛగా రిగ్గింగ్‌కు పాల్పడుతుంటే, సీఐ ప్రభాకర్‌ రావు దగ్గరుండి వారికి సహకరించారు. వైఎస్సార్‌సీపీ పోలింగ్‌ ఏజెంట్లను బలవంతంగా బయటకు నెట్టివేసి, పక్క గ్రామాల నుంచి వచ్చిన గూండాలను బూతుల్లోకి పంపి రౌడీయిజం చేయించారు. ● 8వ వార్డు కౌన్సిలర్‌ అభ్యర్థి పోలూరి అర్చన మూర్తి దంపతులపై టీడీపీ మూకలు విచక్షణారహితంగా దాడి చేస్తుంటే, రక్షణగా నిలవాల్సిన సీఐ బాధితులనే బెదిరించి బయటకు పంపించి రిగ్గింగ్‌కు రాచబాట వేశారు. ● 7వ వార్డులో జూనియర్‌ కళాశాల కేంద్రం వద్ద వేలాది మంది ప్రజలు చూస్తుండగానే పోలింగ్‌ సమయం ముగిసినా టీడీపీ శ్రేణులను లోపలికి పంపి రిగ్గింగ్‌ చేయించారు. ● 19వ వార్డులో ఇతర గ్రామాల నుంచి వచ్చిన పచ్చ మూకలు రిగ్గింగ్‌ చేస్తుంటే బయట ప్రతిఘటించిన వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై లాఠీలతో విరుచుకుపడి తరిమి వేశాడు.

వినుకొండ సీఐ ప్రభాకర్‌ రావు అక్రమాలపై ప్రజాగ్రహం బహిరంగంగా టీడీపీకి గులాంగిరీపై తీవ్ర విమర్శలు

బైండోవర్‌ పేరిట వేధింపులు

సాక్షి టాస్క్‌ ఫోర్స్‌: ఆయన ఖాకీ చొక్కా మాటున దాగి ఉన్న పచ్చ రాబందు.. పోలీసు శాఖే సిగ్గుతో తలదించుకునేలా అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు ఒత్తుతుంటాడు. స్థానిక ఎమ్మెల్యేకి జీ హుజూర్‌ అంటూ ఆయన చెప్పిందే వేద వాక్కుగా ఎంతటి కుట్రలనైనా అమలు చేస్తుంటాడు. లా అండ్‌ ఆర్డర్‌ అంటే లెక్క లేదు. ప్రజాస్వామ్యం అంటే ఏంటో తెలియదు.. రూల్స్‌ అసలే పాటించడు.. ఇతనికి అధికార పార్టీ చెప్పిందే వేద వాక్కు.. ఆయన చెబితే .. కిడ్నాపర్‌గా మారి వైఎస్సార్‌ సీపీ అభ్యర్థులను అర్ధరాత్రి ఎత్తుకెళతాడు. పచ్చనేతలు చెప్పిందే తడవుగా వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లను బయటకు లాగేందుకు సహకరిస్తాడు.. అధికార పార్టీ ఎమ్మెల్యే చెబితే... ముస్లిం యువకులను కేసుల్లో ఇరికించేందుకు సైతం వెనుకాడడు. టీడీపీ గుండాలు బ్రాహ్మణ మహిళపై దాడిచేసి అందరూ చూస్తుండగానే విచక్షణా రహితంగా కొడుతున్నా.. తన విధులను పచ్చనేతల ముందు తాకట్టుపెట్టి మహిళలనే తిరిగి దూషిస్తూ బయటకు నెట్టి వేస్తాడు.. ఆయన ఎవరో కాదు.. వినుకొండ టౌన్‌ సీఐ ప్రభాకర్‌.. ఈయన చేసే చేష్టలు.. వ్యవహరించే తీరు చూసి వినుకొండ ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. వినుకొండలో పోస్టింగ్‌కు వచ్చినప్పటి నుంచి ఇదే తీరులో ప్రవర్తిస్తున్నాడు. ఎన్నికల వేళ పూర్తిగా పచ్చ దళంలో చేరిపోయాడు. పోలీసనే మాట మరిచి నామినేషన్‌ల దగ్గర్నుంచి, ఎన్నికలయ్యేవరకు టీడీపీ కార్యకర్తలు చేయలేని పనిని సైతం చేస్తూ దిగజారి, బరితెగించి వ్యవహరిస్తున్నాడు.

నామినేషన్ల నాటి నుంచే బెదిరింపుల పర్వం

ఎన్నికల నామినేషన్‌ ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచే సీఐ ప్రభాకర్‌రావు ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేశారు. అర్ధరాత్రిళ్లు తన సిబ్బందితో వైఎస్సార్‌ సీపీ నాయకుల ఇళ్లకు వెళ్లి నేరుగా బెదిరింపులకు దిగడమే కాకుండా, నామినేషన్ల ఉపసంహరణ సమయంలో టీడీపీ నాయకులకు బహిరంగంగా కొమ్ముకాస్తూ ప్రత్యక్ష పాత్ర పోషించారు. నామినేషన్‌ పత్రాలను చించివేస్తున్నా అడ్డుకోకపోగా.. ప్రశ్నించిన వారిపై ‘గంజాయి కేసులు పెట్టి లోపలేస్తాం‘ అంటూ బెదిరింపులకు దిగడం ఆయన నిరంకుశత్వానికి నిలువెత్తు నిదర్శనం.

రిగ్గింగ్‌ వేళ ప్రత్యక్ష పాత్ర... వార్డుల్లో అరాచకం!

ఒత్తిడి నెపంతో హౌస్‌ అరెస్టులు

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులను ‘పైనుంచి ఒత్తిడి ఉంది‘ అంటూ తరచూ హౌస్‌ అరెస్టులు చే స్తూ వినుకొండలో భయానక వాతావరణాన్ని సృష్టించారు. ఎక్కడ గొడవ జరి గినా అధికార పార్టీకి అండగా నిలుస్తూ వైఎస్సార్‌ సీపీ శ్రేణులపై విరుచుకుపడటమే సీఐ నైజంగా మారింది.

ప్రైవేటు కేసులకు వైఎస్సార్‌ సీపీ సిద్ధం

సీఐ ప్రభాకర్‌ రావు ఏకపక్షంగా వ్యవహరిస్తారని ముందే ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసినా, కూటమి పెద్దలు, స్థానిక ఎమ్మెల్యే అండదండలతో ఆయన రెచ్చిపోయారు. ఆయన చేసిన ప్రతి అక్రమానికి సంబంధించి వైఎస్సార్‌ సీపీ ముఖ్య నేతలు పక్కా ఆధారాలు సేకరించారు. సీఐ ప్రభాకర్‌ రావు అక్రమాలపై ఎన్నికల కమిషన్‌, పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో పాటు ఆయనపై కోర్టులో ప్రైవేటు కేసులు దాఖలు చేసేందుకు వైఎస్సార్‌ సీపీ నేతలు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాయి.

ఎన్నికల ముందు రోజు రాత్రి ఏ తప్పు చేయని 14 మంది వైఎస్సార్‌ సీపీ యువకులపై బైండోవర్‌ కేసులు నమోదు చేసి, వారిని వేరే గొడవల్లో ఇరికించేందుకు సీఐ కుట్ర పన్నారు. దీనిపై సమాచారం అందుకున్న వందలాది మంది ముస్లిం మహిళలు పోలీస్‌ స్టేషన్‌ ఎదుట అర్ధరాత్రి 3 గంటల వరకు ధర్నాకు దిగారు. సీఐ లాఠీలు, గన్నులతో బెదిరించినప్పటికీ మహిళలు వెనక్కి తగ్గకపోవడంతో, చివరకు దిగివచ్చి హామీ ఇచ్చి మరుసటి రోజు రాత్రి వరకు స్టేషన్‌లోనే నిర్బంధించి భయపెట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement