మాచర్ల: ఆదివారం జరిగిన మాచర్ల పురపాలక సంఘం ఎన్నికల్లో తెలుగుదేశం గూండాలు బూత్‌లు ఆక్రమించడం, రిగ్గింగ్‌లకు పాల్పడడం.. ముఖ్యంగా 23వ వార్డు పోలింగ్ కేంద్రంలో సీసీ కెమెరాలు ధ్వంసం చేయడం వంటి ఘటనలకు పాల్పడడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం ఆ వార్డులో రీ పోలింగ్ నిర్వహించారు. గురజాల ఆర్‌డీఓ మురళీ, డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఎన్నికల అధికారి వేణుబాబులు ఉదయం నుంచే ఎన్నికల నిర్వహణకు చర్యలు తీసుకున్నారు. పలువురు సీఐలు, ఎస్‌ఐలతో కలిపి 150 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించారు. ఈ నేపథ్యంలో బూత్‌కు నాలుగు వైపులా పోలీసులను మోహరించి స్లిప్పులను పరిశీలించిన తరువాతనే లోపలికి పంపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మొత్తం 1213 ఓట్లకు గాను 772 ఓట్లు పడ్డాయి. రెండు బూత్‌లు కలిపి మొత్తం 59.52శాతం పోలింగ్ నమోదైంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు కఠినంగా వ్యవహరించారు.
మాచర్ల 23వ వార్డులో 59.52 శాతం పోలింగ్


